Nupur Sharma: నుపుర్ శర్మ విజ్ఞప్తికి సమ్మతించిన సుప్రీం కోర్టు... అన్ని కేసులు ఢిల్లీకి బదిలీ

  • మహ్మద్ ప్రవక్తపై నుపుర్ అనుచిత వ్యాఖ్యలు
  • దేశంలోని పలు రాష్ట్రాల్లో కేసుల నమోదు
  • అన్ని కేసులను కలిపివేయాలన్న నుపుర్
Supreme Court agrees Nupur Sharma request

మహ్మద్ ప్రవక్తపై అనుచిత వ్యాఖ్యలు చేసి బీజేపీ నుంచి సస్పెన్షన్ కు గురైన నుపుర్ శర్మకు సుప్రీంకోర్టులో కొద్దిమేర ఊరట కలిగింది. తనపై నమోదైన పోలీసు కేసులన్నింటినీ కలిపివేయాలని నుపుర్ శర్మ చేసుకున్న విజ్ఞప్తి పట్ల సుప్రీంకోర్టు సమ్మతి తెలిపింది. ఆమెపై దేశవ్యాప్తంగా నమోదైన 10 కేసులను ఢిల్లీకి బదిలీ చేయాలని, ఆ కేసులన్నింటిలో ఢిల్లీ పోలీసులు దర్యాప్తు జరపాలని ఆదేశించింది. 

మహ్మద్ ప్రవక్తపై నుపుర్ శర్మ చేసిన వ్యాఖ్యలతోనే దేశీయంగానే కాకుండా అంతర్జాతీయంగానూ విమర్శలు వచ్చాయి. ఎప్పుడూ భారత్ ను నేరుగా విమర్శించని పలు గల్ఫ్ దేశాలు కూడా నుపుర్ వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించాయి. దాంతో సర్దిచెప్పుకోలేక ఎన్డీయే సర్కారు ఎంతో ఇబ్బందిపడింది.

ఇక, భారత్ లో నుపుర్ పై అనేక రాష్ట్రాల్లో పెద్ద సంఖ్యలో కేసులు నమోదయ్యాయి. దాంతో, తనపై నమోదైన కేసులన్నింటినీ కలిపి విచారించాలని ఆమె సుప్రీంకోర్టును కోరారు. దీనిపై సుప్రీం ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. ఆమె ప్రాణాలకు హాని ఉందన్న బెదిరింపులను తాము పరిగణనలోకి తీసుకుంటున్నామని న్యాయమూర్తులు పేర్కొన్నారు.

More Telugu News