Vijay Devarakonda: సినిమా ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ తో వెళ్లడానికి కారణం ఇదే: విజయ్ దేవరకొండ

Vijay Devarakonda response on wearing slippers
  • విడుదలకు సిద్ధంగా ఉన్న 'లైగర్' సినిమా
  • ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ తో వెళ్తున్న విజయ్ దేవరకొండ
  • తనకు ఏది నచ్చితే అది ధరిస్తానన్న విజయ్
విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన 'లైగర్' సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. ప్యాన్ ఇండియా లెవెల్లో నిర్మితమైన ఈ చిత్రం ఆగస్ట్ 25న విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. అయితే, ప్రమోషన్ కార్యక్రమాలకు విజయ్ స్లిప్పర్స్ తో వెళ్తుండటం తెలిసిందే. జనాల దృష్టిని ఆకట్టుకునేందుకే విజయ్ దేవరకొండ ఇలా చేస్తున్నాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. 

ఈ అంశంపై విజయ్ దేవరకొండ స్పందించారు. బ్రాండ్ తో సంబంధం లేకుండా తాను అన్ని వస్తువులను ఇష్టపడతానని చెప్పాడు. ఆ సమయంలో తనకు ఏది నచ్చితే దాన్ని ధరిస్తానని తెలిపాడు. ప్రతి రోజు ఒక డ్రెస్, దానికి మ్యాచ్ అయ్యే షూల కోసం వెతుక్కోవడానికి ఎక్కువ సమయం పడుతుందని... అందుకే స్లిప్పర్స్ కొనుగోలు చేశానని చెప్పాడు. ప్రమోషన్స్ కి స్లిప్పర్స్ వేసుకుని పోవడం వల్ల ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో అనే విషయాన్ని తాను పట్టించుకోనని అన్నాడు.
Vijay Devarakonda
Tollywood
Slippers

More Telugu News