Bollywood: మహిళలపై బాలీవుడ్​ సీనియర్ నటుడి అనుచిత వ్యాఖ్యలు.. నెటిజన్ల మండిపాటు

If a girl wants sex she is a sex worker says Mukesh Khanna Internet slams actor
  • యూట్యూబ్  వీడియోలో మహిళలపై ద్వేషపూరిత వ్యాఖ్యలు చేసిన ముఖేష్ ఖన్నా 
  •  మహిళలు హద్దుల్లో ఉండాలన్న శక్తిమాన్ హీరో 
  •  ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు
బాలీవుడ్ సీనియర్ నటుడు, శక్తిమాన్ హీరోగా ప్రసిద్ధి చెందిన ముఖేష్ ఖన్నా మహిళల గురించి చేసిన వ్యాఖ్యలు వివాదాస్పదం అయ్యాయి. శృంగారం కోరుకునే మహిళలను ఆయన వ్యభిచారులుగా పేర్కొనడంపై విమర్శలు వస్తున్నాయి. ముఖేష్  ఓ యూ ట్యూబ్ చానెల్ ను నడుపుతున్నారు. వివిధ అంశాలపై తన అభిప్రాయాలు తెలుపుతూ వీడియోలను పోస్ట్ చేస్తున్నారు. 

ఈ క్రమంలో తాజాగా ఆయన షేర్ చేసిన వీడియోపై దుమారం రేగింది. ‘మీరు కూడా ఇలాంటి అమ్మాయిని ఇష్టపడుతున్నారా?’ అనే టైటిల్ తో రూపొందించిన వీడియోలో ముఖేష్ మాట్లాడుతూ.. ‘ఏ అమ్మాయి అయినా అబ్బాయితో శృంగారం కావాలనుకుంటున్నట్టు చెబితే తాను అమ్మాయి కాదు, వ్యభిచారి అవుతుంది. ఎందుకంటే నాగరిక సమాజానికి చెందిన సభ్యతగల అమ్మాయి ఎప్పుడూ అలాంటి మాటలు చెప్పదు’ అన్నారు. 

అలాగే, ఇంటర్నెట్‌లో మహిళల ప్రలోభాలకు గురికాకుండా జాగ్రత్త వహించాలని పురుషులను కోరారు. మహిళలు రాకెట్లు నడిపేందుకు ప్రయత్నిస్తున్నారని, అమాయక పురుషులను బ్లాక్ మెయిల్ చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నగ్న చిత్రాలు పంపాలని కోరి, ఆ తర్వాత డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేయడానికి ఉపయోగించే సోషల్ మీడియా ఖాతాల పట్ల అప్రమత్తంగా ఉండాలన్నారు. 

యువతులతో ఉచిత శృంగారం అందిస్తామంటూ తనకు కూడా సందేశాలు వచ్చాయని ముకేష్ వెల్లడించారు. అలాగే,  మహిళలు తమ హద్దుల్లో ఉండాలని, సంప్రదాయాలను గౌరవించాలని కోరారు. ఈ వీడియో వైరల్ అవ్వగా.. ముఖేష్ వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి. నెటిజన్లు ఆయన తీరును తప్పుబడుతూ, మండిపడుతున్నారు.
Bollywood
mukhesh khanna
sex
girls
youtube
Viral Videos

More Telugu News