సోషల్ మీడియాను షేక్ చేస్తున్న గద్దర్ పాట!

  • సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న 'బానిసలారా లెండిరా' పాట
  • స్వయంగా పాటను రాసి, పాడిన గద్దర్
  • సంగీతాన్ని అందించిన ఎంఎం కీరవాణి
Gaddar song goin viral in social media

ప్రజా యుద్ధ నౌక గద్దర్ పాడిన 'బానిసలారా లెండిరా' అనే పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. నెటిజెన్ల నుంచి ఈ పాటకు విపరీతమైన స్పందన వస్తోంది. ఈ పాటను గద్దర్ స్వయంగా రాయడమే కాక... హృదయాలను తాకేలా పాడారు. ఈ పాటకు ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఎంఎం కీరవాణి సంగీతాన్ని అందించారు. ఈ పాటకు సుచిత్రా చంద్రబోస్ కొరియోగ్రఫీని అందించారు. 

బొమ్మాకు మురళి నిర్మిస్తున్న సినిమా కోసం గద్దర్ ఈ పాటను పాడారు. ఈ సినిమాలో సీనియర్ నటి సితార, రాజకీయ నేత అద్దంకి దయాకర్ కీలక పాత్రలను పోషించారు. ఈ చిత్రానికి ఇంకా పేరు పెట్టలేదు. బొమ్మాకు క్రియేషన్స్ పతాకంపై బొమ్మాకు మురళి ఈ సినిమాను నిర్మించారు.

More Telugu News