Naga Chaitanya: సమంత ఎదురుపడితే ఏం చేస్తారు? అన్న ప్రశ్నకు నాగ చైతన్య ఆశ్చర్యపరిచే సమాధానం

Naga Chaitanya reveals what he will do if he meets Samantha now
  • హాయ్ చెప్పి హగ్ చేసుకుంటానన్న నాగ చైతన్య 
  • తాన వివాహ తేదీని అభిమానులు కూడా టాటూగా వేయించుకున్నారని వెల్లడి  
  • అభిమానులు తన పచ్చబొట్టును ఫాలో కావొద్దని సూచన
నాగ చైతన్యతో ఒకే గదిలో ఏకాంతంగా ఉంటే ఏం చేస్తారు? కాఫీ విత్ కరణ్ షోలో సమంతకు ఎదురైన ప్రశ్న ఇది. దీనికి, పదునైన ఆయుధాలు అక్కడ లేకుండా చూడాలంటూ సమాధానం ఇచ్చింది సమంత. తద్వారా తమ మధ్య అంత అగాధం ఉందని ఆమె అంగీకరించినట్టయింది. కానీ, ఇటువంటి ప్రశ్నే ఎదుర్కొన్న నాగచైతన్య.. తన సమాధానంతో సమంత అభిమానులను సైతం ఆశ్చర్యపరిచాడు.

తాజాగా ఓ మీడియా సంస్థకు నాగచైతన్య ఇచ్చిన ఇంటర్వ్యూలో.. సమంతను కలుసుకుంటే ఏం చేస్తారు? అనే ప్రశ్న ఎదురైంది. దీనికి నాగచైతన్య స్పందిస్తూ.. హాయ్ చెప్పి, హగ్ చేసుకుంటానన్నాడు. ఎంతో కాలంగా ప్రేమించుకుని 2017 అక్టోబర్ లో సమంత, నాగచైతన్య వైవాహిక జీవితంలో ప్రవేశించడం తెలిసిందే. సరిగ్గా నాలుగేళ్లకు 2021 అక్టోబర్ లో వేరు పడుతున్నట్టు ప్రకటించారు. 

నాగచైతన్య తన చేతిపై వివాహ తేదీని కోడ్ రూపంలో పచ్చబొట్టుగా వేయించుకున్నాడు. దీన్ని తొలగించుకునే ఉద్దేశ్యం లేనట్టు అతడు స్పష్టం చేశాడు. ‘‘నేను కొందరు అభిమానులను కలుసుకున్నాను. ఆ సందర్భంగా వారి చేతిపై నామాదిరే టాటూ వేయించుకోవడం చూశాను. అది నా వివాహ తేదీ. కనుక అభిమానులు దీన్ని అనుసరించాలని అనుకోవడం లేదు’’ అని పేర్కొన్నాడు.

Naga Chaitanya
samantha
interview
reveals
meets

More Telugu News