ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో ఘాటు వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు... వీడియో ఇదిగో!

09-08-2022 Tue 20:43
  • ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియో కాల్ రగడ
  • ఆంబోతుల్లా తయారయ్యారని ఆగ్రహం
  • పనికిమాలిన వాళ్లంటూ వ్యాఖ్యలు
  • ఇలాంటి ఆంబోతులను కట్టడి చేసే శక్తి టీడీపీకి ఉందని వెల్లడి
Chandrababu responds on Gorantla Madhav issue
వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంలో టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు తీవ్రస్థాయిలో స్పందించారు. ఊరికొక ఆంబోతు తయారవుతున్నాడని మండిపడ్డారు. ఈ ఆంబోతులు బట్టలిప్పేసి తిరుగుతుంటే మనం చూస్తూ ఉండాలి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తన 40 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి పనికిమాలిన వాళ్లను చూడలేదని అన్నారు. సిగ్గున్నవాడైతే ఇలాంటి పనిచేసి ఎవడూ బయట తిరగరని వ్యాఖ్యానించారు. 

సిగ్గులేని వాళ్లందరూ రాజకీయాల్లోకి వస్తున్నారని, ఆ సిగ్గులేనివాళ్లు మళ్లీ కులం, మతం, ప్రాంతం అంటారని విమర్శించారు. చేసిన తప్పు కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో చేస్తుంటారని వెల్లడించారు.  

"ముఖ్యమంత్రి, పార్టీకి అధ్యక్షుడుగా ఉన్న వ్యక్తి పార్టీలో వాళ్లు తప్పు చేస్తే శిక్షించాలి. పిలిచి సరిచేయాలి. అవసరమైతే ఒకరిద్దరిని డిస్మిస్ చేయాలి. దాంతో మిగతావాళ్లకు భయం ఉంటుంది. కానీ ఇలాంటివి చేయకపోవడం వల్ల ఎక్కడికక్కడ కీచకులు తయారయ్యారు. భయం లేకుండా, ఇష్టానుసారం ఆడబిడ్డలపై పడే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే వాళ్లకో ధైర్యం వచ్చింది... మా ముఖ్యమంత్రి ఏమీ అడగడన్న భరోసాతో రెచ్చిపోతున్నారు. మేం ఆంబోతుల మాదిరిగా తిరుగుతాం అంటున్నారు. ఇలాంటి ఆంబోతులను కట్టడి చేసే శక్తి టీడీపీకి ఉంది. ఇలాంటివాళ్లను వదిలిపెట్టేది లేదు. ఊళ్ల మీదపడి దౌర్జన్యాలు, కబ్జాలు, అత్యాచారాలు చేస్తారా? కేసులు పెడతారా?" అంటూ మండిపడ్డారు.