రద్దీ నేపథ్యంలో వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల రావొద్దు: టీటీడీ విజ్ఞప్తి

09-08-2022 Tue 20:06
  • ఈ నెల 11 నుంచి 15 వరకు సెలవులు
  • తిరుమలకు రద్దీ పెరిగే అవకాశం
  • భారీగా భక్తులు తరలివస్తారని భావిస్తున్న టీటీడీ
TTD predicts huge rush to Tirumala in coming days
వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వరుస సెలవుల నేపథ్యంలో తిరుమలలో మళ్లీ రద్దీ నెలకొనే అవకాశం ఉందని టీటీడీ అంచనా వేస్తోంది. ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు సెలవుల కారణంగా తిరుమలకు అధిక సంఖ్యలో భక్తులు తరలి వచ్చే అవకాశం ఉందని టీటీడీ భావిస్తోంది. 

రద్దీని దృష్టిలో ఉంచుకుని వృద్ధులు, చిన్నపిల్లల తల్లిదండ్రులు, దివ్యాంగులు తిరుమల పర్యటన వాయిదా వేసుకోవాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమలకు వచ్చే సాధారణ భక్తులు ప్రణాళిక బద్ధంగా ముందుగానే దర్శనం, వసతి బుక్ చేసుకుని రావాలని స్పష్టం చేసింది.