Chandrababu: అమరావతిలోని వీఐటీ, ఎస్ఆర్ఎం యూనివర్శిటీలపై చంద్రబాబు ప్రశంసలు

Chandrababu congratulates VIT and SRM Universities
  • ఔట్ లుక్ ఇండియా ఎమర్జింగ్ ప్రైవేట్ యూనివర్శిటీల జాబితాలో వీఐటీ, ఎఆర్ఎంలకు చోటు
  • తమ హయాంలో చేపట్టిన పనులు ఫలితాలనిస్తున్నాయని వ్యాఖ్య

వీఐటీ (వేలూర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్), ఎస్ఆర్ఎం యూనివర్శిటీలపై టీడీపీ అధినేత చంద్రబాబు ప్రశంసలు కురిపించారు. ఔట్ లుక్ ఇండియా ప్రకటించిన దేశంలోని టాప్ 15 ఎమర్జింగ్ ప్రైవేట్ యూనివర్శిటీల జాబితాలో అమరావతిలో స్థాపించిన ఈ రెండు యూనివర్శిటీలు తొలి, మూడో స్థానాలను సొంతం చేసుకున్నాయని చంద్రబాబు అన్నారు.

తమ హయాంలో ఏపీని నాలెడ్జ్ హబ్ చేసే క్రమంలో ఒక విజన్ తో చేపట్టిన పనులు ఫలితాలను ఇస్తున్నాయని చెప్పారు. రాష్ట్ర భవిష్యత్తును మరింత ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ యూనివర్శిటీలు ప్రయత్నిస్తుండగా... వైసీపీ ప్రభుత్వం మాత్రం ఈ యూనివర్శిటీల క్యాంపస్ లలో ఒక్క ఇంచు రోడ్డు వేయడం కానీ, ఉన్న రోడ్లను బాగు చేయడం కానీ చేయలేదని విమర్శించారు. ముఖ్యమంత్రి ధ్యాస మొత్తం ప్రచారం మీదే ఉంటుందని మండిపడ్డారు. మంచి చేయడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.
Chandrababu
VIT
SRM University
Telugudesam

More Telugu News