Nithin: బాలీవుడ్ భారీ ఆఫర్ ను వదులుకున్నాను: కృతి శెట్టి

Krithi Shetty Interview
  • వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి
  • ఆమె తాజా చిత్రంగా రూపొందిన 'మాచర్ల నియోజక వర్గం'
  • 'స్వాతి' పాత్రలో మెప్పిస్తానంటున్న కృతి శెట్టి 
  • టాలీవుడ్ తనకేం తక్కువ చేయలేదంటూ వ్యాఖ్య 
కృతి శెట్టి వరుస సినిమాలతో తన కెరియర్ ను పరుగులు తీయిస్తోంది. ఆమె తాజా చిత్రమైన 'మాచర్ల నియోజకవర్గం' ఈ నెల 12వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజశేఖర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో ఆమె నితిన్ సరసన 'స్వాతి' పాత్రలో సందడి చేయనుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్ లో ఆమె బిజీగా ఉంది.

 తాజా ఇంటర్వ్యూలో కృతి శెట్టి మాట్లాడుతూ .. "టాలీవుడ్ నాకు వరుస హిట్లను అందిస్తూ వచ్చింది. 'బంగార్రాజు' తరువాత నాకు బాలీవుడ్ నుంచి భారీ ఆఫర్ వచ్చింది. కెరియర్ ఆరంభంలోనే బాలీవుడ్ నుంచి అంత పెద్ద ఆఫర్ వస్తుందని నేను ఊహించలేదు. అలా అని చెప్పేసి ఆ ప్రాజెక్టును ఒప్పుకోలేదు" అంది. 

టాలీవుడ్ నాకు 'ఉప్పెన ' వంటి హిట్ తో గ్రాండ్ వెల్ కమ్ చెప్పింది. అంతటితో ఆగకుండా నాకు హ్యాట్రిక్ హిట్ ఇచ్చింది. వరుసగా నన్ను వెతుక్కుంటూ ఎన్నో కొత్త ప్రాజెక్టులు వస్తున్నాయి. కథలు వినడానికి కూడా ఖాళీ లేనంత బిజీగా ఉన్నాను. ఇక్కడ ఏం తక్కువైందని బాలీవుడ్ కి వెళ్లడానికి అనిపించింది. అందుకే బాలీవుడ్ ఆఫర్ ను  సున్నితంగా తిరస్కరించాను" అని చెప్పుకొచ్చింది.
Nithin
Krithi Shetty
Macharla Niyiojakavargam Movie

More Telugu News