Jagan: హజ్రత్ ఇమామ్ హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శం: జగన్‌

Jagan message to Musling on Moharram
  • మొహర్రం సందర్భంగా సందేశాన్ని విడుదల చేసిన సీఎం  
  • త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రం ప్రతీక అన్న ముఖ్యమంత్రి 
  • మొహర్రం సంతాప దినాలు మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని వ్యాఖ్య
మొహర్రం సందర్భంగా ముస్లింలకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక సందేశాన్ని విడుదల చేశారు. త్యాగానికి, ధర్మ పరిరక్షణకు మొహర్రం ఒక ప్రతీక అని ఆయన అన్నారు. మహమ్మద్ ప్రవక్త మనవడు హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానానికి మొహర్రం ప్రతీక అని చెప్పారు. నమ్మిన సిద్ధాంతం కోసం కష్టనష్టాలను భరించి, ఆత్మ బలిదానానికి కూడా సిద్ధపడిన హుస్సేన్ జీవితం అందరికీ ఆదర్శమని అన్నారు. పవిత్రమైన ఈ మొహర్రం సంతాప దినాలు రాష్ట్రంలో మత సమైక్యతకు ప్రతీకగా నిలుస్తాయని చెప్పారు.
Jagan
YSRCP
Muharram

More Telugu News