నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ.. విస్తృత ఏర్పాట్లు చేసిన అధికార యంత్రాంగం

09-08-2022 Tue 08:05
  • ఈ నెల 13 వరకు జరగనున్న రొట్టెల పండుగ
  • కోర్కెలు తీరాలంటూ రొట్టెలు ఇచ్చిపుచ్చుకోనున్న జనం
  • 2015లో రాష్ట్ర పండుగగా ప్రకటించిన ప్రభుత్వం
Rottela Panduga Starts today in Nellore
నెల్లూరులో నేటి నుంచి రొట్టెల పండుగ ప్రారంభం కానుంది. భక్తులు లక్షలాదిగా తరలివచ్చే అవకాశం ఉండడంతో జిల్లా యంత్రాంగం విస్తృత ఏర్పాట్లు చేసింది. మత సామరస్యానికి ప్రతీకగా నిలిచే ఈ పండుగను 2015లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా ప్రకటించింది. 

బారా షహాద్ దర్గా వద్ద ఈ నెల 13 వరకు జరిగే రొట్టెల పండుగలో పాల్గొనేందుకు కులమతాలు, భాష, ప్రాంతీయ భేదాలకు అతీతంగా భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తారు. తమ కోర్కెలు తీరాలంటూ రొట్టెలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. ఈ పండుగకు జాతీయస్థాయిలోనూ గుర్తింపు ఉంది.