ICET: ఏపీలో ఐసెట్ ఫలితాల వెల్లడి... 87.83 శాతం ఉత్తీర్ణత

  • ఐసెట్ ఫలితాలు విడుదల చేసిన ఏయూ వీసీ
  • రెడ్డప్పగారి కేతన్ కు మొదటి ర్యాంకు
  • మొత్తం 87.83 శాతం మందికి అర్హత
ICET results released in AP

ఏపీ ఐసెట్-2022 పరీక్ష ఫలితాలను ఏయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ పీవీజీడీ ప్రసాద్ రెడ్డి విడుదల చేశారు.  రెడ్డప్పగారి కేతన్ (తిరుపతి) మొదటి ర్యాంకు సాధించాడు. డి.పూజిత వర్ధన్ (గుంటూరు) రెండో ర్యాంకు, వంశీ భరద్వాజ్ (శ్రీకాకుళం) మూడో ర్యాంకు సాధించారు. 

ఎంబీఏ, ఎంసీఏ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఐసెట్ పరీక్షలో 87.83 శాతం ఉత్తీర్ణత నమోదైంది. అబ్బాయిల్లో ఉత్తీర్ణత శాతం 87.98 కాగా, అమ్మాయిల్లో 87.68 శాతం ఉత్తీర్ణత నమోదైంది. మొత్తం 42,496 మంది పరీక్షకు హాజరు కాగా, వారిలో 37,326 మంది అర్హత పొందారని ఏయూ వీసీ వెల్లడించారు.

More Telugu News