ధనుశ్ కోసం కొనసాగుతున్న కథల వేట!

08-08-2022 Mon 19:13
  • కోలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న ధనుశ్
  • టాలీవుడ్ కథలపై చూపుతున్న ఉత్సాహం
  • ఆయనను లైన్లో పెట్టే  పనిలో బడా నిర్మాతలు 
  • కొత్త కథల కోసం సాగుతున్న కసరత్తు
Dhanush in Mythri Movie
ధనుశ్ ఒక వైపున తమిళ సినిమాలతో బిజీగా ఉంటూనే, మరో వైపున తెలుగు సినిమాలు చేయడానికి ఉత్సాహాన్ని చూపుతున్నాడు. ప్రస్తుతం ఆయన వెంకీ అట్లూరి దర్శకత్వంలో 'సార్' సినిమా చేస్తున్నాడు. తమిళంలో 'వాతి' అనే పేరుతో ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ సినిమా నుంచి వదిలిన పోస్టర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. 
 
విద్యా వ్యవస్థ నేపథ్యంలో నడిచే ఈ కథలో ధనుశ్ లెక్చరర్ గా కనిపించనున్నాడు. ఆ తరువాత సినిమాను ఆయన శేఖర్ కమ్ముల దర్శకత్వంలో చేయనున్నాడు. ప్రస్తుతం అందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. ఇక మైత్రీ బ్యానర్ వారు కూడా  ధనుశ్ తో సినిమా చేయడానికి ఆసక్తిని చూపుతున్నారని సమాచారం. 

ఈ మధ్య మైత్రీవారు ఒక వైపున పెద్ద సినిమాలను .. మరో వైపున చిన్న సినిమాలను నిర్మిస్తున్నారు. ఇక ద్విభాషా చిత్రాలను కూడా నిర్మించాలనే నిర్ణయానికి వచ్చేశారని టాక్. అందుకోసం దర్శకుల దగ్గర ఉన్న కథలను వింటున్నారట. ద్విభాషా చిత్రానికి తగిన లైన్ దొరికితే, ధనుశ్ ను ఒప్పించగలమనే గట్టి నమ్మకంతోనే ప్రయత్నాలు చేస్తున్నారట.