ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్ డ్రా చేసింది: లోక్ సభలో కేంద్రం వెల్లడి

08-08-2022 Mon 18:51
  • జీపీఎఫ్ ఖాతాల నుంచి సొమ్ము విత్ డ్రా
  • లోక్ సభలో ప్రశ్నించిన టీడీపీ ఎంపీ కేశినేని నాని
  • లిఖితపూర్వక సమాధానం ఇచ్చిన నిర్మలా సీతారామన్
Center tells that AP govt withdrew funds from employees GPF
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల జీపీఎఫ్ పై లోక్ సభలో కేంద్రం వివరణ ఇచ్చింది. ఉద్యోగుల జీపీఎఫ్ నుంచి ఏపీ ప్రభుత్వం నిధులు విత్ డ్రా చేసిందని వెల్లడించింది. 2021-22లో రూ.413.73 కోట్లు విత్ డ్రా చేసినట్టు కేంద్ర ఆర్థికశాఖ వివరించింది. ఉద్యోగుల జీపీఎఫ్ సొమ్ముపై టీడీపీ ఎంపీ కేశినేని నాని లోక్ సభలో ప్రశ్నించారు.  నాని అడిగిన ప్రశ్నకు ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఈ మేరకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 

కాగా, ఉద్యోగుల జీపీఎఫ్ నిధుల ఉపసంహరణ అంశం ఏపీ హైకోర్టులోనూ విచారణకు రావడం తెలిసిందే. సాంకేతిక కారణాల వల్లే ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము విత్ డ్రా చేయడం జరిగిందని ప్రభుత్వం తరఫున ఏజీ శ్రీరామ్ నాడు వాదనలు వినిపించారు. బడ్జెట్ మంజూరు అయితే, ఉద్యోగుల ఖాతాల్లో సొమ్ము తిరిగి జమ చేస్తామని అన్నారు. ఇంకా ఆయన పలు కారణాలు వివరించేందుకు ప్రయత్నించగా, హైకోర్టు స్పందిస్తూ, ప్రభుత్వం చెప్పే వివరాలు కాగ్ కు కూడా అర్థంకావని పేర్కొంది.