liger: అక్కడ కూడా విజయ్ దేవరకొండ క్రేజ్ మామూలుగా లేదుగా!

liger craze continues as vijay deverakonda ananya panday visit ahmedabad
  • లైగర్ ప్రమోషన్స్ లో బిజీగా విజయ్, అనన్య
  • అహ్మదాబాద్ లో ప్రమోషనల్ ఈవెంట్ కు ఎగబడ్డ జనం
  • విజయ్ క్రేజ్ కు ఆశ్చర్యపోతున్న బాలీవుడ్ జనాలు!
విజయ్ దేవరకొండ హీరోగా నటించిన తాజా చిత్రం ‘లైగర్’. బాక్సింగ్ బ్యాక్ డ్రాప్ lo వస్తున్న ఈ చిత్రాన్ని పూరి జగన్నాథ్‌ రూపొందించాడు. ఈనెల 25వ తేదీన విడుదలయ్యే ఈ చిత్రంతో విజయ్ బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్నాడు. బాలీవుడ్‌ యంగ్ బ్యూటీ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్, పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. విజయ్, అనన్య మధ్య కెమిస్ట్రీ ఆకట్టుకుంటోంది. అదే సమయంలో విజయ్ తనదైన శైలిలో సినిమాను ప్రమోట్ చేస్తున్నాడు.

దేశంలోని ప్రధాన నగరాల్లో పర్యటిస్తూ అక్కడి అభిమానులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాడు. మొన్నటిదాకా ముంబై, పూణెలో ప్రమోషన్లలో హీరో హీరోయిన్లు సందడి చేశారు. ముంబైలోనే కాకుండా నార్త్ లోనూ ఇతర నగరాల్లోనూ ‘లైగర్’ చిత్రానికి.. విజయ్, అనన్యను ప్రేక్షకులు అక్కున చేర్చుకుంటున్నారు. తాజాగా గుజరాత్‌లోని అహ్మదాబాద్‌ నగరంలో చిత్రం ప్రమోషన్లలో పాల్గొన్నారు. ఒక మాల్ లో జరిగిన ఈవెంట్లో విజయ్, అనన్యలను చూసేందుకు ఫ్యాన్స్ ఎగబడ్డారు. 

దాంతో, మాల్ మొత్తం జనసంద్రంగా మారిపోయింది. విజయ్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరుస్తూ సందడి చేశారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్లో హల్ చల్ చేస్తున్నాయి. తెలుగు హీరోకు వస్తున్న రెస్పాన్స్ చూసి బాలీవుడ్ బడా హీరోలు సైతం ఆశ్చర్యపోతున్నారు.
liger
Vijay Devarakonda
ananya pande
craze
ahmedabad

More Telugu News