Taapsee Pannu: తన లైంగిక జీవితంపై తాప్సీ ఆసక్తికర కామెంట్

Taapsee Pannu says her sex life is not interesting enough to get her on Koffee With Karan
  • కాఫీ విత్ కరణ్ షోలో కనిపించకపోవడంపై తాప్సీకి ఎదురైన ప్రశ్న
  • తన లైంగిక జీవితం అంత ఆసక్తికరం కాదన్న నటి
  • అందుకే ఆహ్వానం రాలేదంటూ సమాధానం
తెలుగుతోపాటు బాలీవుడ్ సినిమాల్లో కథానాయికగా పలు పాత్రల్లో కనిపించిన తాప్సీ తన వ్యక్తిగత జీవితం గురించి ఆసక్తికర కామెంట్ చేశారు. నిర్మాత కరణ్ జొహార్ ‘కాఫీ విత్ కరణ్’ పేరుతో సీజన్ 7 నిర్వహిస్తున్నారు. దీనికి జాన్వీకపూర్, విజయ్ దేవరకొండ, అనన్యపాండే సహా ఎంతో మంది ప్రముఖ నటీనటులు హాజరు కావడమే కాకుండా, ఎన్నో సంచలన విషయాలు బయటపెడుతున్నారు. దీంతో ఈ షో పట్ల ఆసక్తి పెరిగిపోయింది.

ఈ క్రమంలో తాను నటించిన దొబారా చిత్రం ప్రమోషన్ లో ఉన్న తాప్సీకి.. కాఫీ విత్ కరణ్ లో కనిపించకపోవడం గురించి ప్రశ్న ఎదురైంది. దీనికి తాప్పీ స్పందిస్తూ.. కాఫీ విత్ కరణ్ కు ఆహ్వానించేంతగా నా లైంగిక జీవితం ఆసక్తికరంగా లేదు’’ అని ఆమె బదులిచ్చి షాక్ చేసింది. కరణ్ జొహార్ తన షోలో పాల్గొనే సెలబ్రిటీల వ్యక్తిగత జీవితం, లైంగిక జీవితం గురించి ప్రశ్నలు వేస్తూ రహస్యాలను బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేయడం తెలిసిందే. అందుకే తాప్సీ ఇలా వ్యాఖ్యానించి ఉంటుంది.  

కాఫీ విత్ కరణ్ ప్రతి గురువారం డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో ప్రసారం అవుతుంటుంది. ఈ షోలో పాల్గొన్న ఆమిర్ ఖాన్.. ప్రతి ఒక్కరి వ్యక్తిగత లైంగిక జీవితాల గురించి ప్రశ్నలు అడగడాన్ని తప్పుబట్టడం గమనార్హం. జాన్వీకపూర్ డేటింగ్ విషయాన్ని కూడా కరణ్ బయటపెట్టడం గమనార్హం.
Taapsee Pannu
sex life
not interesting
Koffee With Karan

More Telugu News