10 million: ఎన్నికల జాబితాలో డూప్లికేట్లు.. సుమారు కోటి మంది పేర్లు తొలగింపు!

Around 10 million duplicate entries in electoral roll removed or corrected
  • ఒకే పేరు, ఒకే ఫొటో కలిగిన డూప్లికేట్ పేర్ల తొలగింపు
  • దేశవ్యాప్తంగా ఎన్నికల కమిషన్ జాబితా ప్రక్షాళన 
  • ధ్రువీకరించుకున్న తర్వాతే తొలగించినట్టు స్పష్టీకరణ
దేశవ్యాప్తంగా ఎన్నికల జాబితా నుంచి పెద్ద ఎత్తున నకిలీ పేర్లను ఏరిపారేశారు. ఒకే పేరు, ఒకే ఫొటోతో ఒకటికి మించి ఉన్న వాటిని తొలగించారు. గడిచిన ఏడు నెలల్లో ఇలా మొత్తం మీద కోటి మంది పేర్లను తొలగించడం లేదా సరిదిద్దడం చేసినట్టు ఎన్నికల కమిషన్ ప్రకటించింది. 

ఓటర్ల సమగ్ర డిజిటల్ జాబితాపై ఎన్నికల కమిషన్ కొంత కాలంగా దృష్టి పెట్టింది. ఇందులో భాగంగా నకిలీల ఏరివేతను ప్రాధాన్య అంశంగా తీసుకుని చర్యలు అమలు చేసింది. దేశవ్యాప్తంగా ఓటర్లను వారి ఆధార్ తో స్వచ్ఛందంగా అనుసంధానించుకునేందుకు ఎన్నికల కమిషన్ అనుమతించడం తెలిసిందే. ఈ క్రమంలో 11,91,191 ఓట్లు ఒకే పేరుతో ఒకటికి మించి ఉన్నట్టుగా ఎన్నికల కమిషన్ గుర్తించింది. వీటిని పరిశీలించిన తర్వాత 9,27,853 ఓటర్ల పేర్లను తొలగించింది. 

బూత్ స్థాయిలో ధ్రువీకరించుకున్న తర్వాతే జాబితానుంచి పేర్లను తొలగించినట్టు, స్వచ్ఛందంగా తొలగించలేదని ఎన్నికల కమిషన్ అధికారులు తెలిపారు. ఇక ఫొటోలు ఒకే రీతిలో ఉన్న 3,18,89,422 ఓటర్లను గుర్తించగా, తనిఖీ తర్వాత 98,00,412 ఓట్లను తొలగించినట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. 

10 million
duplicate entries
electoral roll
voters
duplicate
election commission

More Telugu News