Qamar Mohsin Shaikh: ఎప్పట్లాగానే ప్రధాని మోదీకి రాఖీ పంపిన పాక్ మహిళ

Pakistani woman Qamar Mohsin Shaikh sends Rakhi to PM Modi
  • పెళ్లయిన తర్వాత గుజరాత్ లో స్థిరపడిన పాక్ మహిళ
  • 20 ఏళ్లకు పైగా మోదీకి రాఖీ కడుతున్న వైనం
  • ఈసారి మోదీ తనను పిలుస్తారని ఆశాభావం
  • వచ్చే ఎన్నికల్లో మోదీ గెలవాలని ఆకాంక్ష
పాకిస్థాన్ కు చెందిన ఖమర్ మొహిసిన్ షేక్ అనే మహిళ గత 20 ఏళ్లకు పైగా ప్రతి రక్షాబంధన్ పండుగకు భారత్ ప్రధాని నరేంద్ర మోదీకి రాఖీ పంపించడం ఆనవాయతీగా మారింది. ఈ ఆగస్టు నెల 11న రక్షాబంధన్ పండుగ కాగా, ఖమర్ మొహిసిన్ భారత ప్రధాని మోదీకి రాఖీ పంపారు. పాక్ జాతీయురాలైన ఖమర్ పెళ్లి తర్వాత గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ఉంటున్నారు. ఆమె మోదీని తన సోదరుడిగా భావిస్తారు. 

ఈసారి ఆమె స్వయంగా రూపొందించిన రాఖీని పంపించడం విశేషం. రేష్మీ రిబ్బన్ పై ఎంబ్రాయిడరీ వర్క్ చేసిన ఆ రాఖీతో పాటు ఖమర్ ఓ లేఖను కూడా మోదీకి పంపారు. తనను ఈసారి మోదీ ఢిల్లీకి ఆహ్వానిస్తారని భావిస్తున్నట్టు ఖమర్ పేర్కొన్నారు. కాగా, వచ్చే పార్లమెంటు ఎన్నికల్లోనూ మోదీ విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నట్టు తెలిపారు.
Qamar Mohsin Shaikh
Rakhi
Narendra Modi
Pakistan
India

More Telugu News