Woman Lies Under Delivery Van: ఫ్రిడ్జ్‌ ఇంట్లో పెట్టేదాకా కదిలేది లేదు.. డెలివరీ వ్యాన్‌ టైర్ల ముందు పడుకొని మహిళ బెదిరింపు.. వీడియో వైరల్‌!

Woman lies under delivery drivers car to force him to carry fridge into her house
  • ఆన్ లైన్ లో ఫ్రిడ్జ్ బుక్ చేసిన అమెరికా పెద్దావిడ
  • ఇంటి ఆవరణలో దింపి వెళ్లిపోబోయిన డెలివరీ వ్యాన్ డ్రైవర్
  • ఇంటి లోపలి గదిలో పెట్టాలంటూ పెద్దావిడి డిమాండ్.. వ్యాన్ టైర్ల ముందు పడుకొని హంగామా
  • అంతా వీడియో తీసి టిక్ టాక్ లో పెట్టిన డ్రైవర్.. కొన్ని రోజుల్లోనే 2.5 కోట్ల వ్యూస్
ఆన్ లైన్ లో ఏదో వస్తువు బుక్ చేశారు. డెలివరీ వచ్చింది. కొందరు ఇంటి లోపలిదాకా తెచ్చిస్తారు.. మరికొందరు ఇంటి గేటు వద్దే ఆగి ఫోన్ చేసి ఇచ్చి వెళతారు. వచ్చిన వాళ్లను బట్టి మనమూ వస్తువులను తీసుకుంటూ ఉంటాం. కానీ అమెరికాలో ఓ పెద్దావిడ మాత్రం నానా హంగామా చేసింది. డెలివరీ వ్యాన్ టైర్లకు అడ్డంగా పడుకుని గోల చేసింది. సదరు డెలివరీ వ్యాన్ డ్రైవర్ ఇదంతా వీడియో తీసి టిక్ టాక్ లో పెట్టడంతో వైరల్ గా మారింది.

ఇంతకీ ఏం జరిగింది?
అమెరికాలో ఓ పెద్దావిడ ఆన్ లైన్ లో ఫ్రిడ్జ్ ను బుక్ చేసింది. సదరు కంపెనీ ఫ్రిడ్జ్ ను కొరియర్ కంపెనీ ద్వారా పంపించింది. దాన్ని డెలివరీ ఇవ్వడానికి వచ్చిన వ్యక్తి వ్యాన్ లోంచి ఫ్రిడ్జ్ ను దింపి ఇంటి ఆవరణలో పెట్టి వెళ్లిపోబోయాడు. కానీ ఆ ఫ్రిడ్జ్ ను ఇంటి లోపల గదిలో పెట్టాలని ఆ పెద్దావిడ డిమాండ్ చేసింది. కానీ ఇంటి దాకా డెలివరీ ఇవ్వడం మాత్రమే తన డ్యూటీ అని.. లోపల ఎక్కడికంటే అక్కడికి తెచ్చి పెట్టడం తన పని కాదని డెలివరీ వ్యాన్ డ్రైవర్ స్పష్టం చేశాడు. తన దారిన తాను వెళ్లిపోయేందుకు డెలివరీ వ్యాన్ ఎక్కాడు.
  • కానీ ఆ పెద్దావిడ మాత్రం అస్సలు వెనక్కి తగ్గలేదు. ఫ్రిడ్జ్ ను తాము మోయలేమని, దానిని ఇంటి లోపల పెట్టాల్సిందేనని డిమాండ్ చేస్తూ.. వ్యాన్ టైర్లకు ముందు పడుకుంది.
  • ఫ్రిడ్జ్ ను ఇంటి లోపల పెట్టేదాకా కదలనివ్వనని, కావాలంటే తనపైనుంచి వ్యాన్ ను పోనివ్వాలంటూ మొండికేసింది. సదరు డెలివరీ వ్యాన్ డ్రైవర్.. దీనంతటినీ వీడియో తీసి టిక్ టాక్ లో పెట్టడంతో వైరల్ గా మారింది. కొన్ని రోజుల్లోనే రెండున్నర కోట్ల మందికిపైగా ఈ వీడియో చూశారు. భారీగా షేర్ చేశారు.
  • ‘పాపం పెద్దావిడ ఫ్రిడ్జ్ ను ఇంట్లో పెట్టేస్తే ఏమయ్యేది..’ అంటూ కొందరు డ్రైవర్ ను తప్పుపడుతుంటే.. ‘డెలివరీ కంపెనీలు ఇంటి వద్ద ఇచ్చేందుకే డబ్బులు ఇస్తాయి. బరువును ఎత్తి లోపల పెట్టాలంటే ఎలా..? కావాలంటే అదనంగా డబ్బులు ఇస్తానని చెప్పవచ్చుగా..’ అని మరికొందరు డ్రైవర్ ను సమర్థిస్తూ కామెంట్లు పెట్టేస్తున్నారు.

 
Woman Lies Under Delivery Van
Online
ecommers
USA
Delivery Man
Offbeat

More Telugu News