నా మిత్రుడు రజనీకాంత్ మాదిరి మరొకరు ఉండరు: అనుపమ్ ఖేర్
- ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్ వద్ద కలుసుకున్న మిత్రులు
- ఆజాదీకా అమృతోత్సవ్ కార్యక్రమానికి హాజరు
- ఇన్ స్టా గ్రామ్ లో ఫొటోను పంచుకున్న అనుపమ్ ఖేర్
నా స్నేహితుడు రజనీకాంత్ మాదిరి మరొకరు ఉండరు. ఎప్పటికీ లేరు, ఉండరు. జైహో అజాదీకా అమృతోత్సవ్’’అంటూ ఇన్ స్టా గ్రామ్ లో అనుపమ్ ఖేర్ పోస్ట్ పెట్టారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు అవుతున్న సందర్భంగా కేంద్ర సర్కారు ఆజాదికా అమృతోత్సవ్ పేరిట ఉత్సవాలను నిర్వహిస్తోంది. రాష్ట్రపతి భవన్ లో జరుగుతున్న ఈ ఉత్సవాలకు అనుపమ్ ఖేర్, రజనీకాంత్ హాజరయ్యారు.