Kodela Sivaram: సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తున్నా.. అంబటి పోటీ చేస్తారా?: కోడెల శివరాం

will Contest from Sattenapalle says kodela Sivaram
  • ఓడినా, గెలిచినా సత్తెనపల్లి ప్రజలతోనే ఉంటానన్న శివరాం
  • ఈ మూడేళ్లలో తనను ఎన్నో రకాల వేధింపులకు గురిచేశారని ఆవేదన
  • అధికారం లేకపోతే అంబటి సత్తెనపల్లిలో ఉండలేరని విమర్శ
తెలుగుదేశం పార్టీ నేత కోడెల శివరాం కీలక ప్రకటన చేశారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో తాను సత్తెనపల్లి నుంచి పోటీ చేయబోతున్నట్టు ప్రకటించారు. ఓడినా, గెలిచినా సత్తెనపల్లి ప్రజలతోనే ఉంటానని అన్నారు. ఈ మూడేళ్లలో తనను ఎన్నో రకాలుగా వేధించాలని చూశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో కేసులు పెట్టారని గుర్తు చేశారు. 

అంతేకాదు, పాలు పోసిన వారే పాముల్లా కాటేస్తున్నారని అన్నారు. కోడెల శివప్రసాదరావు బిడ్డగా సత్తెనపల్లిలో పోటీ చేసి గెలిచి తీరుతానని శివరాం ధీమా వ్యక్తం చేశారు. సత్తెనపల్లి నుంచి పోటీ చేస్తానని వైసీపీ నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రకటించగలరా? అని ప్రశ్నించారు. అధికారం లేకపోతే అంబటి సత్తెనపల్లిలో ఉండలేరని శివరాం విమర్శించారు.
Kodela Sivaram
TDP
Sattenapalle
Ambati Rambabu

More Telugu News