Team India: ఫ్లోరిడాలో ఆలస్యంగా ప్రారంభమైన మ్యాచ్... బ్యాటింగ్ కు దిగిన టీమిండియా

Team India put into bat first in Florida
  • టీమిండియా, వెస్టిండీస్ మధ్య నాలుగో టీ20
  • వర్షం కారణంగా ఆలస్యం
  • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న విండీస్
  • దూకుడుగా ఆడుతున్న టీమిండియా ఓపెనర్లు
ఫ్లోరిడాలో వరుణుడు కరుణించడంతో టీమిండియా, వెస్టిండీస్ జట్ల మధ్య నాలుగో టీ20 మ్యాచ్ ప్రారంభమైంది. వర్షం నిలిచిపోవడంతో దాదాపు అరగంట ఆలస్యంగా టాస్ వేశారు. టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ కు దిగిన భారత్ 3 ఓవర్లు ముగిసేసరికి వికెట్ నష్టపోకుండా 39 పరుగులు చేసింది. కెప్టెన్ రోహిత్ శర్మ 25, సూర్యకుమార్ యాదవ్ 13 పరుగులతో క్రీజులో ఉన్నారు. 

ఈ సిరీస్ లో టీమిండియా 2-1తో ఆధిక్యంలో ఉన్న సంగత తెలిసిందే. ఐదు మ్యాచ్ ల సిరీస్ లో మొదటి మూడు మ్యాచ్ లకు వెస్టిండీస్ ఆతిథ్యం ఇచ్చింది. అయితే అమెరికాలోనూ క్రికెట్ కు ప్రజాదరణ కల్పించాలన్న ఐసీసీ ప్రణాళికల్లో భాగంగా సిరీస్ లో మిగిలిన రెండు వన్డేలను ఫ్లోరిడాలో నిర్వహిస్తున్నారు.
Team India
West Indies
Batting
Florida
4th T20

More Telugu News