YSRCP: స్పీక‌ర్ త‌మ్మినేని కుమారుడి వివాహ వేడుక‌కు హాజ‌రైన జ‌గ‌న్‌... ఫొటోలు ఇవిగో

ap cm attends ap assembly speaker tammineni sitaran son marriage
  • ఆమదాల‌వ‌ల‌స‌లో జ‌రిగిన వివాహ వేడుక‌
  • నూత‌న వ‌ధూవ‌రుల‌ను ఆశీర్వ‌దించిన జ‌గ‌న్‌
  • అటు నుంచి అటే ఢిల్లీ వెళ్ల‌నున్న సీఎం   
ఏపీ అసెంబ్లీ స్పీక‌ర్ త‌మ్మినేని సీతారాం కుమారుడు వెంకట శ్రీరామ చిరంజీవి నాగ్ వివాహం మాధురితో శ‌నివారం ఘ‌నంగా జ‌రిగింది. శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలసలోని గవర్నమెంట్‌ జూనియర్‌ కాలేజ్‌ గ్రౌండ్స్‌లో జరిగిన వివాహవేడుకకు ఏపీ సీఎం వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హాజ‌ర‌య్యారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న నూత‌న వ‌ధూవరుల‌ను ఆశీర్వ‌దించారు. అనంత‌రం ఆయ‌న విశాఖ బ‌య‌లుదేరి వెళ్లారు. విశాఖ నుంచే జ‌గ‌న్ ఢిల్లీ ప‌ర్య‌ట‌న‌కు బ‌య‌లుదేర‌నున్నారు. రెండు రోజుల పాటు జ‌గ‌న్ ఢిల్లీలోనే ప‌ర్య‌టించ‌నున్న సంగ‌తి తెలిసిందే.
YSRCP
YS Jagan
Srikakulam District
Tammineni Sitaram
Amudalavalasa

More Telugu News