'బింబిసార' ఫస్టు డే వసూళ్లు ఇవే!

  • నిన్ననే థియేటర్స్ కి వచ్చిన 'బింబిసార'
  • తెలుగు రాష్ట్రాల్లో 9.30 కోట్ల గ్రాస్ వసూళ్లు
  • తొలి రోజు రాబట్టిన షేర్ 6.30 కోట్లు 
  • వీకెండ్ లో పెరగనున్న వసూళ్లు
  • సీక్వెల్ ఖాయమని చెప్పిన కల్యాణ్ రామ్ 
Bimbisara movie update

కల్యాణ్ రామ్ కథానాయకుడిగా రూపొందిన 'బింబిసార' నిన్ననే థియేటర్స్ కి వచ్చింది. వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ సినిమా, తొలి ఆటతోనే హిట్ టాక్ తెచ్చుకుంది. విడుదలకి ముందు నుంచే ఈ సినిమాపై అంచనాలు ఏర్పడ్డాయి. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఈ సినిమా గురించి ఎన్టీఆర్ కాన్ఫిడెంట్ గా చెప్పిన దగ్గర నుంచి అంచనాలు పెరుగుతూ వచ్చాయి. 

తొలి రోజున తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా 9.30 కోట్ల గ్రాస్ ను .. 6.30 కోట్ల షేర్ ను వసూలు చేసింది. కల్యాణ్ రామ్ కెరియర్లో తొలిరోజున ఈ స్థాయి వసూళ్లు సాధించడం ఇదే మొదటిసారి అంటున్నారు. హిట్ టాక్ రావడం వలన .. దగ్గరలో పెద్ద సినిమాలేవీ లేకపోవడం వలన మంచి వసూళ్లను రాబట్టే ఛాన్స్ ఉందని చెబుతున్నారు.

దర్శకుడు వశిష్ఠ కొత్తవాడైనా అతను తయారు చేసుకున్న కథాకథనాలను కల్యాణ్ రామ్ సొంత సంస్థ వీఎఫ్ఎక్స్  .. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ .. చోటా కె నాయుడు ఫొటోగ్రఫీ అదనపు బలాన్ని ఇవ్వడంతో ఈ సినిమా నెక్స్ట్ లెవెల్ కి వెళ్లింది. ఈ కంటెంట్ పై ఉన్న నమ్మకంతోనే కల్యాణ్ రామ్ సీక్వెల్ కూడా ఉంటుందని చెప్పాడు.

More Telugu News