Taiwan: చైనా చేపట్టింది విన్యాసాలు కాదు... మా భూభాగంపై దాడికి సన్నాహాలు: తైవాన్ ఆరోపణ

Taiwan accuses China prepares for attack on mainland
  • తైవాన్ లో నాన్సీ పెలోసీ పర్యటన
  • చైనా ప్రతీకార చర్యలు
  • తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో విన్యాసాలు
  • దాడికి చైనా ప్రణాళిక రూపొందిస్తోందన్న తైవాన్
అమెరికా చట్టసభ స్పీకర్ నాన్సీ పెలోసీ తైవాన్ పర్యటించిందన్న అక్కసుతో చైనా తీవ్రస్థాయిలో సైనిక విన్యాసాలు చేపట్టడం తెలిసిందే. తైవాన్ చుట్టూ ఆరు ప్రాంతాల్లో నేవీ, ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు చేపట్టి ఆ చిన్న ద్వీపదేశాన్ని భయభ్రాంతులకు గురిచేసేందుకు ప్రయత్నించింది. దీనిపై తైవాన్ తాజాగా స్పందించింది. 

చైనా చేపట్టింది సైనిక విన్యాసాలుగా తాము భావించడంలేదని, అవి తైవాన్ భూభాగంపై దాడికి సన్నాహాలుగా భావిస్తున్నామని తైవాన్ రక్షణ శాఖ పేర్కొంది. తైవాన్ జలసంధి ప్రాంతంలో అనేక చైనా విమానాలు, నౌకలను తాము గమనించామని, తైవాన్ ప్రధాన భూభాగంపై ఎలా దాడి జరపాలన్నదానిపై అవి ముందస్తు సన్నాహాలు చేశాయని నమ్ముతున్నామని వెల్లడించింది. చైనా విమానాలు, నౌకల్లో కొన్ని మధ్యస్థ రేఖను కూడా దాటాయని ఆరోపించింది.
Taiwan
China
Drills
Nancy Pelosi
USA

More Telugu News