ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ గుజరాత్ ఆలయాల సందర్శనలో వెంకయ్య... ఫొటోలు ఇవిగో
- సతీసమేతంగా గుజరాత్‌లో పర్యటిస్తున్న వెంకయ్య
- గుజరాత్‌లోని పలు ఆలయాలను సందర్శిస్తున్న ఉపరాష్ట్రపతి
- రాత్రికి తిరిగి ఢిల్లీ చేరనున్న వెంకయ్య దంపతులు
గుజరాత్ పర్యటనలో భాగంగా వెంకయ్య దంపతులు ఇప్పటికే ద్వారకాలోని నాగేశ్వర్ జ్యోతిర్లింగ ఆలయం, ద్వారకాదీశ ఆలయం, పోర్ బందర్‌లోని కృతి ఆలయాలను సందర్శించారు. ఈ రోజు గుజరాత్ పర్యటనను ముగించుకోనున్న వెంకయ్య రాత్రికి తిరిగి ఢిల్లీ చేరుకుంటారు. ఈ నెల 10న ఉపరాష్ట్రపతిగా వెంకయ్య పదవీ విరమణ చేయనున్నారు. శనివారం కొత్తగా ఎన్నిక కానున్న ఉపరాష్ట్రపతి ఈ నెల 11న పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు.