Vijay Devarakonda: పూణెలోని టీ స్టాల్​లో విజయ్​ దేవరకొండ సందడి!

Vijay Deverakonda visited the famous Graduate Chaiwali in the Patna
  • లైగర్ చిత్రం ప్రమోషన్స్ లో విజయ్ బిజీ
  • పూణెలో ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలి’ టీ స్టాల్ కు వెళ్లిన హీరో
  • ఈ నెల 25న విడుదలవనున్న చిత్రం
విజ‌య్ దేవ‌ర‌కొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్లో వస్తున్న చిత్రం ‘లైగర్’. ప్యాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కిన ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. విజయ్ సరసన బాలీవుడ్ యువ నటి అనన్యా పాండే హీరోయిన్ గా నటించింది. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ఓ కీలక పాత్ర పోషించారు. దాంతో, ఈ చిత్రం కోసం తెలుగు ప్రేక్షకులతో పాటు హిందీ జనాలు కూడా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాడు. ఈ నెల 25వ తేదీన ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. హిందీ, తెలుగుతో పాటు పలు భాషల్లో విడుదలవనుంది.

మరోవైపు చిత్ర బృందం  ప్రమోషన్లలో జోరు పెంచింది. హీరో హీరోయిన్లు విజయ్, అనన్యా పాండే పలు ఈవెంట్లలో పాల్గొంటూ చిత్రాన్ని ప్రేక్షకులకు చేరువ చేసే ప్రయత్నంలో ఉన్నారు. ఈ మధ్యే  ముంబైలో ‘గాడ్ ఫాదర్’ సెట్లో మెగాస్టర్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ ను చిత్ర బృందం కలిసింది.

ప్రస్తుతం హీరో విజయ్ పూణెలో ప్రమోషన్స్ లో పాల్గొంటున్నాడు. ఈ క్రమంలో పూణె సిటీలో ‘గ్రాడ్యుయేట్ చాయ్ వాలి’ పేరిట ఏర్పాటు చేసిన ఫేమస్ టీ స్టాల్ ను విజయ్ సందర్శించాడు. ఆ టీ స్టాల్ నిర్వాహకులతో ఫొటో దిగిన విజయ్ టీ రుచి చూశాడు. వాళ్లతో సెల్ఫీ తీసుకున్నడు. ఇందుకు సంబంధించిన ఫొటోలను చిత్ర నిర్మాణ సంస్థ  ‘పూరి కనెక్ట్స్’ ట్విట్టర్ లో షేర్ చేసింది.
Vijay Devarakonda
Puri Jagannadh
ananya pande
liger movie
graduates chaiwali
pune

More Telugu News