Mirabai Chanu: భారత వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలీవుడ్ స్టార్ నటుడి ప్రశంసలు

Chris Hemsworths epic reply for CWG gold medallist Mirabai Chanu
  • చానును లెజండ్ అంటూ కీర్తించిన క్రిస్ హేమ్స్‌వర్త్
  • పతకానికి ఆమె అర్హురాలేనన్న స్టార్ నటుడు
  • థోర్ సినిమాతో క్రిస్‌కు ప్రపంచవ్యాప్త గుర్తింపు

బర్మింగ్‌హామ్‌లో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల్లో భారత్‌కు తొలి పసిడి పతకం అందించిన వెయిట్‌లిఫ్టర్ మీరాబాయి చానుపై హాలీవుడ్ ప్రముఖ నటుడు క్రిస్ హేమ్స్‌వర్త్ ప్రశంసల వర్షం కురిపించాడు. ‘థోర్’ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన క్రిస్.. పతకానికి ఆమె అర్హురాలేనంటూ ట్వీట్ చేశాడు. అంతేకాదు,  ‘లెజెండ్’ అంటూ చానుపై ప్రశంసలు కురిపించాడు.

కామన్వెల్త్ గేమ్స్‌లో మీరాబాయి చాను 49 కిలోల విభాగంలో మొత్తంగా 201 కేజీలు (88 ప్లస్ 113 కేజీలు) ఎత్తి బంగారు పతకం అందుకుంది. 27 ఏళ్ల చానుకు కామన్వెల్త్‌లో ఇది మూడో పతకం. అంతకుముందు గ్లాస్గోలో రజత పతకం, గోల్డ్ కోస్ట్ ఎడిషన్‌లో పసిడి పతకం అందుకుంది. తాజాగా బర్మింగ్‌హామ్‌లో మరో పసిడి అందుకుంది. కామన్వెల్త్‌లో దేశానికి తొలి పసిడి అందించిన చానుపై ట్విట్టర్‌లో ప్రశంసల వర్షం కురుస్తోంది.

  • Loading...

More Telugu News