Komatireddy Raj Gopal Reddy: ఈ నెల 21న అమిత్ షా స‌మ‌క్షంలో బీజేపీలో చేర‌తాను: కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి

komatireddy rajagopal reddy says he will joins bjp on 21st of this month
  • ఢిల్లీలో అమిత్ షాను క‌లిసిన రాజ‌గోపాల్ రెడ్డి
  • అమిత్ షా త‌న‌ను బీజేపీలోకి ఆహ్వానించార‌ని వెల్ల‌డి
  • బ‌హిరంగ స‌భ‌లోనే బీజేపీలో చేర‌తాన‌న్న కోమ‌టిరెడ్డి
కాంగ్రెస్ పార్టీకి, ఆ పార్టీ ద్వారా ద‌క్కిన మునుగోడు ఎమ్మెల్యే ప‌ద‌వికి రాజీనామా చేసిన కోమ‌టిరెడ్డి రాజ‌గోపాల్ రెడ్డి శుక్ర‌వారం కీల‌క ప్ర‌క‌ట‌న చేశారు. తాను ఈ నెల 21న కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా స‌మక్షంలో బీజేపీలో చేర‌నున్న‌ట్లు ఆయ‌న ప్ర‌క‌టించారు. తెలంగాణ‌లో బ‌హిరంగ స‌భ ఏర్పాటు చేసి... ఆ వేదిక‌పైనే తాను బీజేపీలో చేర‌తాన‌ని ఆయన వెల్ల‌డించారు. ఈ మేర‌కు ఢిల్లీలో అమిత్ షాను క‌లిసిన అనంత‌రం ఆయ‌న అక్క‌డే మీడియాతో మాట్లాడారు.

తెలంగాణ‌కు చెందిన బీజేపీ నేత వివేక్‌తో క‌లిసి తాను అమిత్ షాను క‌లిసిన‌ట్లు రాజ‌గోపాల్ రెడ్డి వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా త‌న‌ను అమిత్ షా బీజేపీలోకి ఆహ్వానించార‌ని చెప్పారు. అందుకు తాను కూడా సానుకూలంగానే స్పందించిన‌ట్లు తెలిపారు. బీజేపీలో చేరేందుకు ఏర్పాటు చేయ‌నున్న బ‌హిరంగ స‌భ‌కు వ‌స్తాన‌ని అమిత్ షా చెప్పార‌ని ఆయ‌న తెలియజేశారు. 
Komatireddy Raj Gopal Reddy
BJP
Amit Shah
Vivek Venkataswamy
Telangana

More Telugu News