Bandi Sanjay: వెంకటరెడ్డి మాతో టచ్ లో ఉన్నారని నేను అనలేదు.. అలాంటి వార్తలు రాయొద్దు: బండి సంజయ్

I dint said Komatireddy Venkat Reddy is in touch with us says Bandi Sanjay
  • తాను అనని మాటలను బ్రేకింగులు పెట్టి రాయొద్దన్న సంజయ్ 
  • నిధుల కోసం మోదీని వెంకటరెడ్డి కలుస్తుంటారని వ్యాఖ్య 
  • మునుగోడు ఉపఎన్నికలో బీజేపీదే విజయమని ధీమా 
కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి తమతో టచ్ లో ఉన్నారని తాను అనలేదని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ అన్నారు. తాను అనని మాటను అన్నట్టుగా బ్రేకింగులు పెట్టి వార్తలు రాయొద్దని మీడియాను కోరుతున్నానని చెప్పారు. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి మోదీ అని అన్నారు. 

అభివృద్ధికి సంబంధించిన నిధుల కోసం మోదీని కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తుంటారని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీదే విజయమని అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ చేపట్టిన మూడో విడత ప్రజా సంగ్రామ యాత్ర ప్రస్తుతం భువనగిరి నియోజకవర్గంలో కొనసాగుతోంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో బీజేపీ ప్రభుత్వం వచ్చాక అందరి సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు.
Bandi Sanjay
BJP
Narendra Modi
Komatireddy Venkat Reddy
Congress
Munugodu
Bypolls

More Telugu News