కల్యాణ్ రామ్ 'బింబిసార' సినిమాపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన

  • ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'బింబిసార'
  • తొలి షో నుంచే హిట్ టాక్ తెచ్చుకున్న చిత్రం
  • సినిమా హిట్ కావడంపై సంతోషాన్ని వ్యక్తం చేసిన తారక్
Junior NTR response on Bimbisara movie

నందమూరి కల్యాణ్ రామ్ చిత్రం 'బింబిసార' ఈరోజు ప్రపంచ వ్యాప్తంగా విడుదలయింది. తొలి షో నుంచి ఈ చిత్రం హిట్ టాక్ ను తెచ్చుకుంది. మరోవైపు ఈ సినిమా హిట్ కావడంపై జూనియర్ ఎన్టీఆర్ సంతోషాన్ని వ్యక్తం చేశారు. ''బింబిసార' గురించి గొప్ప విషయాలు వింటున్నా. తొలిసారి మనం సినిమాను చూసినప్పుడు అనుభవించిన అనుభూతినే ప్రజలు కూడా ఫీల్ అయినప్పుడు మంచి అనుభూతి కలుగుతుంది. కల్యాణ్ అన్నయ్యా... బింబిసార రాజు పాత్రలో నిన్ను మరెవరూ రీప్లేస్ చేయలేరు. డైరెక్టర్ వశిష్ట సినిమాను అద్భుతంగా హ్యాండిల్ చేశారు. ఈ సినిమాకు లెజెండరీ ఎంఎం కీరవాణి బ్యాక్ బోన్' అని ట్వీట్ చేశారు.

మరోవైపు కల్యాణ్ రామ్ కెరీర్ లోనే ఈ చిత్రం అత్యధిక బడ్జెట్ తో తెరకెక్కింది. విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో కల్యాణ్ రామ్ సరసన కేథరిన్ ట్రెసా, సంయుక్త మీనన్ లు నటించారు.

More Telugu News