Vijayasai Reddy: ప్రజాస్వామ్యమా వర్ధిల్లు.. ఎన్నో కేసుల్లో ముద్దాయి విజయసాయిరెడ్డి రాజ్యసభను నడిపించారట: వర్ల రామయ్య

  • రాజసభకు నిన్న కాసేపు అధ్యక్షత వహించిన విజయసాయి
  • నేర చరిత్ర కలిగిన వ్యక్తి పెద్దల సభను నడిపించడం విడ్డూరమన్న వర్ల
  • పెద్దల సభకు అవమానం కదూ? అంటూ ప్రశ్న
Vijayasai Reddy sitting in Rajya Sabha chairman seat is an insult says Varla Ramaiah

వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి నిన్న రాజ్యసభకు కాసేపు అధ్యక్షత వహించిన సంగతి తెలిసిందే. రాజ్యసభ ఛైర్మన్ ఛైర్ లో కూర్చొని సభను నడిపించారు. దీనిపై టీడీపీ సీనియర్ నేత వర్ల రామయ్య స్పందిస్తూ విజయసాయిపై విమర్శలు గుప్పించారు. 

'ప్రజాస్వామ్యమా వర్ధిల్లు! ఎన్నో కేసుల్లో ముద్దాయి, ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరవుతూ, భారతదేశంలో A2 గా గుర్తించబడిన విజయసాయి రెడ్డి, నిన్న రాజ్యసభకు అధ్యక్షత వహించి సభను నడిపించారట! ఇంతటి నేర చరిత్రను కలిగిన వ్యక్తి, అంతటి రాజ్యసభకు అధ్యక్షత వహించడం విడ్డూరం కదూ? పెద్దల సభకు అవమానం కదూ?' అని విమర్శించారు. 

మరోవైపు రాజ్యసభకు అధ్యక్షత వహించడంపై విజయసాయి సంతోషాన్ని వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తొలిసారిగా రాజ్యసభను నడిపించే అవకాశం దక్కడాన్ని విశిష్ట గౌరవంగా భావిస్తున్నానని ఆయన తెలిపారు. ఆరేళ్ల కిందట రాజ్యసభలో వైసీపీ తరఫున ఒకే ఒక్కడ్ని ఉండేవాడ్నని, ఇప్పుడిలా చైర్మన్ స్థానంలో సభను నడిపించే భాగ్యం లభించిందని వివరించారు. ఇదంతా కూడా జగన్, భారతమ్మ, ఏపీ ప్రజల దీవెనల వల్లే సాధ్యమైందని వినమ్రంగా తెలిపారు.

More Telugu News