మా సార్వభౌమత్వాన్ని కాపాడుకుంటాం: తైవాన్ అధ్యక్షురాలు
- తైవాన్ ఘర్షణను పెంచదంటూ ప్రకటన
- భద్రతను కాపాడుకుంటామని స్పష్టీకరణ
- చైనా సైనిక విన్యాసాల నేపథ్యంలో స్పందించిన తైవాన్
‘‘చైనా తైవాన్ చుట్టుపక్కల సైనిక విన్యాసాలు చేపట్టింది. కారణం మేరకు స్పందించాలని, నిగ్రహం పాటించాలని బీజింగ్ ను కోరుతున్నాం. తైవాన్ ఘర్షణను పెంచదు. కానీ, మా సార్వభౌమత్వం, భద్రత, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుంటాం’’ అని ఇంగ్ వెన్ ప్రకటించారు.
తైవాన్ తన భూభాగంలోనిది అని చైనా ఎప్పటి నుంచో వాదిస్తోంది. కానీ, తమది స్వతంత్య్ర దేశమని తైవాన్ గుర్తు చేస్తోంది. దీంతో తైవాన్ కు అమెరికా సహా పలు దేశాలు మద్దతుగా నిలుస్తున్నాయి. ఇది చైనాకు మరింత ఆగ్రహం తెప్పిస్తోంది. తమ ప్రాదేశిక భూభాగం తైవాన్ విషయంలో వేలు పెట్టొద్దంటూ అమెరికా సహా ప్రపంచ దేశాలను హెచ్చరిస్తూ, చైనా ఇప్పటికే సంకేతం పంపించింది. ద్వీప దేశమైన తైవాన్ ను తన భూభాగంతో తిరిగి కలుపుతామని, అవసరమైతే బలప్రయోగానికి కూడా వెనుకాడబోమని చైనా లోగడే ప్రకటించింది.