Partha Chatterjee: మమతా బెనర్జీని కూడా పార్థ ఛటర్జీ లెక్క చేసేవారు కాదు: బైశాఖీ బెనర్జీ

  • పార్థ ఛటర్జీ హయాంలో ఎంతో మంది విద్యా సంస్థల్లోకి నేరుగా ప్రవేశించారు
  • క్వాలిఫికేషన్ లేని వారు యూనివర్శిటీల్లోకి ప్రవేశించారు
  • పార్థ ఛటర్జీ విద్యా వ్యవస్థను శాసించారు
Partha Chatterjee didnt consider even Mamata Banerjee says Ex TMC leader

పశ్చిమబెంగాల్ టీచర్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో నిందితుడైన మాజీ మంత్రి పార్థ చటర్జీపై టీఎంసీ మాజీ నేత, వెస్ట్ బెంగాల్ కాలేజ్ అండ్ యూనివర్సిటీ ప్రొఫెసర్స్ అసోసియేషన్ మాజీ జనరల్ సెక్రటరీ బైశాఖీ బెనర్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పార్థ ఛటర్జీ హయాంలో విద్యా సంస్థల్లోకి ఎంతో మంది నేరుగా ప్రవేశించారని ఆరోపించారు. 

సామాన్యులు, ఏ మాత్రం బ్యాక్ గ్రౌండ్ లేనివారు కూడా విద్యారంగంలో చాలా పవర్ ఫుల్ గా మారడాన్ని తాను చూశానని... అన్ని పోస్టులు అమ్మకాలకు ఉండేవని అన్నారు. పాఠశాలల్లో సరిగా పాఠాలు చెప్పలేని వారు కూడా పార్థ ఛటర్జీ అండతో యూనివర్శిటీల్లోకి నేరుగా అడుగు పెట్టారని విమర్శించారు. పార్థ ఛటర్జీ వల్ల సరైన క్వాలిఫికేషన్ లేని వారు కూడా యూనివర్శిటీల్లోకి ప్రవేశించారని చెప్పారు. 

తన కంటే ఎవరూ ఎక్కువ కాదని పార్థ ఛటర్జీ భావించే వారని బైశాఖీ బెనర్జీ అన్నారు. ముఖ్యమంత్రి మమతా బెనర్జీని కూడా ఆయన పట్టించుకునే వారు కాదని ఆమె చెప్పారు. తన హోదాను ఆయన దుర్వినియోగం చేశారని... మొత్తం విద్యా వ్యవస్థనే ఆయన శాసించారని అన్నారు. పూర్తిగా అవినీతిలో కూరుకుపోయారని చెప్పారు.

More Telugu News