Komatireddy Venkat Reddy: వారందరికీ లీగల్ నోటీసులు పంపిస్తా: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి

  • వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారుతారంటూ ప్రచారం
  • తీవ్రంగా స్పందించిన భువనగిరి ఎంపీ
  • తానేమీ నాలుగు పార్టీలు మారి కాంగ్రెస్‌లోకి రాలేదంటూ సెటైర్  
  • మునుగోడు ఉప ఎన్నిక ప్రచారంపై స్పందించని నేత
will send legal notices who Campaign against me warns venkat reddy

మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన నేపథ్యంలో ఆయన సోదరుడు వెంకట్‌రెడ్డి కూడా పార్టీ మారబోతున్నారంటూ జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్రంగా స్పందించారు. 

అలాంటి ప్రచారం చేస్తున్న వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటానని, వారికి లీగల్ నోటీసులు పంపిస్తానని హెచ్చరించారు. సోదరుడు రాజగోపాల్‌రెడ్డి రాజీనామా, మునుగోడు ఉప ఎన్నికలో ప్రచారం తదితర అంశాలపై మాట్లాడేందుకు నిరాకరించిన ఆయన.. కాంగ్రెస్‌లో తాను మూడున్నర దశాబ్దాలుగా పనిచేస్తున్నట్టు గుర్తు చేశారు. 

తెలంగాణ కోసం తన మంత్రి పదవిని కూడా వదులుకున్నట్టు చెప్పారు. తానేమీ నాలుగు పార్టీలు మారి రాలేదంటూ పరోక్షంగా టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. రేవంత్‌‌ను క్షమాపణ చెప్పాలని తాను గతంలోనే కోరానని అన్నారు. తనను పీసీసీ ప్రచార కమిటీ చైర్మన్‌గా సోనియాగాంధీ నియమించారని వెంకట్‌రెడ్డి అన్నారు. నిన్న ఢిల్లీలో విలేకరులతో  మాట్లాడుతూ ఆయనీ వ్యాఖ్యలు చేశారు.

More Telugu News