Team India: పొలార్డ్ ఫ్యామిలీతో పాండ్యా... ఫొటోలు ఇవిగో

hardik pandya visits Kieron Pollard house in west indies
  • వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న టీమిండియా
  • పొలార్డ్ ఇంటికి వెళ్లిన హార్దిక్ పాండ్యా
  • పొలార్డ్ ఆతిధ్యం లేకుండా విండీస్ టూర్ ముగియ‌దంటూ వ్యాఖ్య‌
భార‌త క్రికెట్ జ‌ట్టు ప్ర‌స్తుతం వెస్టిండీస్ ప‌ర్య‌ట‌న‌లో ఉన్న సంగ‌తి తెలిసిందే. ఆతిథ్య జ‌ట్టుతో ఇప్ప‌టికే వ‌న్డే సిరీస్‌ను పూర్తి చేసుకున్న టీమిండియా టీ20 సిరీస్ ఆడుతోంది. 5 మ్యాచ్‌ల‌తో కూడిన ఈ సిరీస్‌లో ఇప్ప‌టికే 3 మ్యాచ్‌లు పూర్తి కాగా... మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. జ‌ట్టులో స‌భ్యుడిగా కొన‌సాగుతున్న ఆల్ రౌండ‌ర్ హార్దిక్ పాండ్యా కూడా వెస్టిండీస్ టూర్‌కు వెళ్లిన సంగ‌తి తెలిసిందే.

ఈ క్ర‌మంలో విండీస్ స్టార్ క్రికెట‌ర్ కీర‌న్ పొలార్డ్ ఇంటికి హార్దిక్ పాండ్యా వెళ్లాడు. పొలార్డ్ విండీస్ క్రికెట‌రే అయినా... ఐపీఎల్‌లో ఏళ్ల త‌ర‌బ‌డి ఆడుతున్న నేప‌థ్యంలో అత‌డితో టీమిండియా ఆట‌గాళ్ల‌కు మంచి అనుబంధ‌మే ఉంది. హార్దిక్ పాండ్యా అయితే పొలార్డ్‌తో మ‌రింత స‌న్నిహితంగా మెల‌గుతున్న విష‌యం తెలిసిసిందే. 

ఈ క్ర‌మంలోనే పొలార్డ్ ఇంటికి వెళ్లిన పాండ్యా... అత‌డి కుటుంబంతో క‌లిసి స‌ర‌దాగా గ‌డిపారు. పొలార్డ్ కుటుంబ స‌భ్యుల‌తో క‌లిసి ఫొటోలు దిగాడు. వీటిని సోష‌ల్ మీడియాలో పంచుకున్న పాండ్యా... పొలార్డ్ ఆతిథ్యం స్వీక‌రించ‌కుండా విండీస్ ప‌ర్య‌ట‌న ముగియ‌దంటూ పేర్కొన్నాడు. అంతేకాకుండా పొలార్డ్ త‌న‌కు బ్ర‌ద‌ర్ లాంటి వాడంటూ కొనియాడాడు.
Team India
West Indies
Hardik Pandya
Kieron Pollard

More Telugu News