వైసీపీ ఎంపీ గోరంట్ల ప‌ర్స‌న‌ల్ వీడియోతో నాకు సంబంధం లేదు: టీడీపీ నేత చింతకాయల విజ‌య్‌

  • మ‌హిళ‌తో న‌గ్నంగా మాధవ్ వీడియో కాల్ మాట్లాడారంటూ ఆరోపణలు
  • వైర‌ల్‌గా మారిపోయిన వీడియో
  • మాధ‌వ్ ఆరోప‌ణ‌ల‌ను ఖండించిన విజ‌య్‌
  • వైసీపీ ఎంపీపై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని ప్ర‌క‌ట‌న‌
tdp leader Vijay chintakayala hits back ysrcp mp gorantla madhav comments

మ‌హిళ‌తో న‌గ్నంగా వీడియో కాల్ మాట్లాడినట్లుగా వైసీపీ ఎంపీ గోరంట్ల మాధ‌వ్ పై వస్తున్న ఆరోపణలు, దానిపై గోరంట్ల మాధవ్ స్పందన... ఇది టీడీపీ పనేనంటూ మాధవ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ రాష్ట్ర ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి చింత‌కాయ‌ల విజ‌య్ స్పందించారు. గోరంట్ల మాధ‌వ్ ప‌ర్స‌న‌ల్ వీడియోతో త‌న‌కు ఎలాంటి సంబంధం లేద‌ని ఆయ‌న స్పష్టం చేశారు. అంతేకాకుండా ఈ వీడియో విడుద‌ల త‌న ప‌నేనంటూ గోరంట్ల మాధ‌వ్ చేసిన ఆరోప‌ణ‌ల‌పైనా విజ‌య్ ఘాటుగా స్పందించారు. 

వైసీపీని రాస‌లీలల పార్టీగా అభివ‌ర్ణించిన విజ‌య్‌..  ఎంపీ గోరంట్ల మాధ‌వ్ త‌న‌పై చేసిన వ్యాఖ్య‌లను ఖండిస్తున్నాన‌ని చెప్పారు. మాధ‌వ్ ప‌ర్స‌న‌ల్ వీడియోకు, త‌న‌కు సంబంధం ఏమిట‌ని కూడా విజ‌య్ ప్ర‌శ్నించారు. ఫోరెన్సిక్ నిపుణులు వాస్త‌వాలు వెల్ల‌డిస్తార‌ని ఆయ‌న తెలిపారు. త‌నపై మాధ‌వ్ చేసిన ఆరోప‌ణ‌ల‌కు సంబంధించి ఆయ‌న‌పై ప‌రువు న‌ష్టం దావా వేస్తాన‌ని విజ‌య్ ప్ర‌క‌టించారు.

More Telugu News