Cricket: లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ లో క్రికెట్... పరిశీలిస్తున్న అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ

  • 2028లో అమెరికా గడ్డపై ఒలింపిక్స్
  • కొత్త క్రీడల తుది జాబితాలో క్రికెట్
  •  వచ్చే ఏడాది ముంబయిలో ఐఓసీ సమావేశం
  • ముంబయిలో తుది నిర్ణయం వెలువడే అవకాశం
IOC keen on induction cricket in Los Angeles Olympics

కామన్వెల్త్ క్రీడల్లోనూ కాలుమోపిన జనరంజక క్రికెట్ క్రీడ ఒలింపిక్స్ లో రంగప్రవేశానికి ఉవ్విళ్లూరుతోంది. అన్నీ కుదిరితే మరో ఆరేళ్లలో ఒలింపిక్స్ లో క్రికెట్ ను చూడొచ్చు. 2028లో అమెరికా నగరం లాస్ ఏంజెలిస్ ఒలింపిక్స్ కు ఆతిథ్యమిస్తుండగా, ఆ క్రీడల్లో క్రికెట్ ను చేర్చే అంశాన్ని అంతర్జాతీయ ఒలింపిక్ కమిటీ (ఐఓసీ) పరిశీలిస్తోంది. 

ఒలింపిక్స్ లో ప్రవేశానికి ఎదురుచూస్తున్న మరో 8 ఇతర క్రీడాంశాలతో కలిపి క్రికెట్ ను కూడా తుది జాబితాలో చేర్చింది. ఈ జాబితాపై సమీక్ష నిర్వహించి 2028 ఒలింపిక్స్ లో ఏఏ క్రీడలకు అనుమతి ఇవ్వాలో ఐఓసీ నిర్ణయించనుంది. 2023లో ముంబయిలో నిర్వహించనున్న ఐఓసీ సమావేశాల్లో దీనిపై పూర్తి స్పష్టత రానుంది. 

ఒలింపిక్స్ లో క్రికెట్ ఎప్పుడో కాలుమోపింది. 1900 సంవత్సరంలో నిర్వహించిన పారిస్ ఒలింపిక్స్ లో క్రికెట్ పోటీలు జరిగాయి. అయితే, ఆ సమయంలో బ్రిటన్, ఫ్రాన్స్ జట్లు మాత్రమే పాల్గొన్నాయి. తదనంతర కాలంలో బ్రిటీషర్ల పుణ్యమా అని క్రికెట్ అనేక దేశాలకు పాకింది. కాగా, ఒలింపిక్స్ లో క్రికెట్ తో పాటు ఎంట్రీ ఇచ్చేందుకు ప్రతిపాదించిన ఇతర అంశాలు బేస్ బాల్/సాఫ్ట్ బాల్, ఫ్లాగ్ ఫుట్ బాల్, లాక్రోస్సే, బ్రేక్ డ్యాన్సింగ్, కరాటే, కిక్ బాక్సింగ్, స్క్వాష్, మోటార్ స్పోర్ట్.

More Telugu News