ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించిన జూనియర్ ఎన్టీఆర్ కుటుంబం

  • ఆగస్ట్ 1న కన్నుమూసిన ఉమామహేశ్వరి
  • తల్లి, భార్య, అన్న కల్యాణ్ రామ్ తో వచ్చిన తారక్
  • బిజీ షెడ్యూల్ కారణంగా అంత్యక్రియలకు హాజరు కాలేకపోయిన వైనం
Junior NTR went to Uma Maheswari home with family

టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ చిన్న కుమార్తె కంఠమనేని ఉమామహేశ్వరి ఇటీవల కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పరామర్శించడానికి ఉమామహేశ్యరి ఇంటికి జూనియర్ ఎన్టీఆర్ వచ్చారు. తన తల్లి, భార్య, అన్న కల్యాణ్ రామ్ లతో కలిసి వచ్చిన తారక్ ఉమామహేశ్వరి కుటుంబాన్ని పరామర్శించారు. 

బిజీ షెడ్యూల్ కారణంగా అంత్యక్రియలకు తారక్ హాజరు కాలేకపోయారు. కంఠమనేని కుటుంబాన్ని పరామర్శించిన వెంటనే వీరు అక్కడి నుంచి వెళ్లిపోయారు. పరామర్శ అనంతరం తారక్ తో మాట్లాడేందుకు మీడియా ప్రతినిధులు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. ఎవరితోనూ, ఏమీ మాట్లాడకుండానే అందరూ వెళ్లిపోయారు. మరోవైపు, వీరు రావడానికి ముందే నారా భువనేశ్వరి అక్కడకు చేరుకున్నారు. ఆగస్ట్ 1న ఉమామహేశ్వరి మృతి చెందిన సంగతి తెలిసిందే.

More Telugu News