KTR: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పై విమర్శనాస్త్రాలు సంధించిన కేటీఆర్

  • అబద్ధాలతో వాస్తవాలను దాచలేరన్న కేటీఆర్
  • అనేక తప్పటడుగులతో దారుణ పర్యవసనాలు ఏర్పడ్డాయని విమర్శ  
KTR targets Nirmala Sitaraman on Union Govt economic policies

కేంద్రంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న మాటల యుద్ధం కొనసాగుతోంది. తాజాగా, కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ను లక్ష్యంగా చేసుకుని తెలంగాణ మంత్రి కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. 

ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎంత మసిపూసి మారేడుకాయ చేసినా కేంద్ర సర్కారు ఆర్థిక తప్పటడుగులను దాచలేరని స్పష్టం చేశారు. నోట్ల రద్దు వంటి కేంద్ర ప్రభుత్వ విఫల ఆర్థిక విధానాల ఫలితంగా దారుణమైన పర్యవసనాలు కళ్లకు కట్టినట్టు కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. జీఎస్టీ మండలి సమావేశాల్లోనూ, పార్లమెంటులోనూ మీకున్న బలం ఉపయోగించి తప్పించుకోగలరేమో కానీ, ఈ వాస్తవాలను ఎలా సమర్థించుకోగలరు? అంటూ కేటీఆర్ ప్రశ్నించారు. 

  • 30 ఏళ్లలో అత్యధిక ద్రవ్యోల్బణం
  • అత్యంత బలహీనపడిన రూపాయి @80
  • 45 ఏళ్లలో అత్యధిక నిరుద్యోగిత
  • ప్రపంచంలోనే అత్యంత అధికంగా ఎల్పీజీ ధర
  • దారిద్ర్యంలో నైజీరియాను దాటిన భారత్

ఇవి కాదనలేని వాస్తవాలు అంటూ ఈ సందర్భంగా  పై అంశాలను కేటీఆర్ ప్రస్తావించారు. భారత్ కొవిడ్ లాక్ డౌన్ లోకి వెళ్లేనాటికి వరుసగా 8 త్రైమాసికాల్లో ఆర్థిక మందగమనం చవిచూసిందని, ఆ భారాన్ని దేశం ఇప్పుడు మోస్తోందని వివరించారు.

More Telugu News