TDP: క‌ర్నూలుకు ఏపీ హైకోర్టు త‌ర‌లింపుపై పూర్తి ప్ర‌తిపాద‌న‌లు ఇంకా అంద‌లేదు: కేంద్ర మంత్రి కిర‌ణ్ రిజిజు

union minister kiren rijiju clarifes on ap high court transfer to kurnool
  • హైకోర్టు త‌ర‌లింపు అంశం త‌మ వ‌ద్ద పెండింగ్‌లో లేద‌న్న రిజిజు
  • హైకోర్టు నిర్వ‌హ‌ణ బాధ్య‌త పూర్తిగా రాష్ట్ర ప్ర‌భుత్వానిదేనని వెల్ల‌డి
  • హైకోర్టును సంప్ర‌దించి రాష్ట్ర ప్ర‌భుత్వ‌మే నిర్ణ‌యం తీసుకుంటుంద‌న్న కేంద్ర మంత్రి
ఏపీ హైకోర్టును అమ‌రావ‌తి నుంచి క‌ర్నూలుకు త‌ర‌లించే అంశంపై త‌మ‌కు ఇంకా పూర్తి ప్ర‌తిపాద‌న‌లు అంద‌లేద‌ని కేంద్ర న్యాయ శాఖ మంత్రి కిర‌ణ్ రిజిజు తెలిపారు. ఈ మేర‌కు టీడీపీ ఎంపీ క‌న‌క‌మేడ‌ల ర‌వీంద్ర కుమార్ రాజ్యసభలో అడిగిన ప్ర‌శ్న‌కు స్పందించిన రిజిజు తమ స‌మాధానాన్ని లిఖితపూర్వ‌కంగా తెలియ‌జేశారు.

అయితే అమ‌రావ‌తి నుంచి ఏపీ హైకోర్టును క‌ర్నూలుకు త‌ర‌లించే విష‌యం కేంద్రం వ‌ద్ద పెండింగ్‌లో లేద‌ని రిజిజు వెల్ల‌డించారు. హైకోర్టు ఎక్క‌డ ఉన్నా దాని నిర్వ‌హ‌ణ బాధ్య‌త మొత్తం రాష్ట్ర ప్ర‌భుత్వానిదేన‌ని ఆయ‌న తెలిపారు. హైకోర్టు త‌ర‌లింపు విష‌యంలో రాష్ట్ర ప్ర‌భుత్వం హైకోర్టునే సంప్ర‌దించి నిర్ణ‌యం తీసుకుంటుంద‌ని మంత్రి పేర్కొన్నారు. హైకోర్టు త‌ర‌లింపుపై ఇటు హైకోర్టుతో పాటు అటు రాష్ట్ర ప్ర‌భుత్వం కూడా త‌మ అభిప్రాయాల‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి తెలియ‌జేయాల్సి ఉంటుంద‌ని ఆయ‌న వెల్ల‌డించారు.
TDP
Kanakamedala Ravindra Kumar
Rajya Sabha
Parliament
Kiren Rijiju
AP High Court
Amaravati
Kurnool

More Telugu News