cholesterol: చేయి, కాళ్లల్లో నొప్పిగా అనిపిస్తుందా..? ఒకసారి కొలెస్ట్రాల్ చెక్ చేసుకోవాల్సిందే!

  • రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదు మించితే అనర్థాలు
  • గుండెపోటు, స్ట్రోక్ రావచ్చు
  • సంకేతాలు ఏవి కనిపించినా నిర్లక్ష్యం చేయవద్దు
  • వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలి
High cholesterol Two painful sensations to watch out for in your arm

మన శరీరం అప్పుడప్పుడు కొన్ని సంకేతాలు ఇస్తుంటుంది. కాకపోతే మనమే వాటిని పెద్దగా పట్టించుకోం. పట్టించుకుంటే అనారోగ్య సమస్యలను ముందే గుర్తించి చికిత్స తీసుకోవడం సాధ్యపడుతుంది. ముఖ్యంగా కొలెస్ట్రాల్ మన శరీరంలో ఎక్కువైతే ఎన్నో అనర్థాలు వస్తాయని తెలుసు. గుండె జబ్బులు, స్ట్రోక్ రూపంలో ప్రాణాలను బలితీసుకునే మహమ్మారి కొలెస్ట్రాల్. కనుక కొలెస్ట్రాల్ మన రక్తంలో సాధారణ స్థాయిలోనే ఉందా? అన్నది ఎప్పటికప్పుడు పరిశీలించుకోవాలి.  

రెండు రకాలు
ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం.. ప్రపంచవ్యాప్తంగా ఇస్చెమిక్ హార్ట్ డిసీజ్ వ్యాధుల్లో మూడింట ఒక వంతు కొలెస్ట్రాల్ కారణంగా వస్తున్నవే. కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉన్నాయి. లో డెన్సిటీ లిపో ప్రొటీన్ (ఎల్డీఎల్), హై డెన్సిటీ లిపో ప్రొటీన్ (హెచ్ డీఎల్). మన శరీరమంతటికీ కొలెస్ట్రాల్ ను తీసుకెళ్లేవే ఈ ప్రొటీన్లు. ఇందులో ఎల్డీఎల్ హాని చేస్తుంది. హెచ్ డీఎల్ మంచి చేస్తుంది. 

కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉంటే..?
రక్తంలో కొలెస్ట్రాల్ మైనం మాదిరిగా ఉంటుంది. కణాలు ఆరోగ్యంగా ఉండేందుకు కొలెస్ట్రాల్ అవసరం. కానీ, అవసరానికి మించినప్పుడు ఇదే కొలెస్ట్రాల్ రక్తంలో పేరుకుపోతుంది. ఇది పెరిగిపోవడం వల్ల ధమనులకు (ఆర్టరీలకు) రక్త సరఫరా తగ్గుతుంది. రక్తనాళాల్లో కొలెస్ట్రాల్ అడ్డుపడడం వల్ల రక్తం గడ్డ కట్టొచ్చు. ఇది గుండెపోటుకు కారణమవుతుంది. కొలెస్ట్రాల్ వల్ల రక్త ప్రవాహానికి ఆటంకాలు ఏర్పడి మెదడుకు ఆక్సిజన్ తగ్గితే స్ట్రోక్ వస్తుంది. 

సంకేతాలు..
మంచి, చెడు కొలెస్ట్రాల్ మధ్య బ్యాలన్స్ అవసరం. కొలెస్ట్రాల్ అధికంగా పేరుకుని రక్త సరఫరా తగ్గినప్పుడు కాళ్లు, చేతుల్లో నొప్పి అనిపించొచ్చు. దీన్ని పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అంటారు. ఒక చేయిలో నొప్పి అనిపించడం కొలెస్ట్రాల్ పెరిగిపోతుందన్న దానికి సంకేతమని మయో క్లినిక్ చెబుతోంది. రాస్తున్నప్పుడు లేదా చేతులతో ఏవైనా పనులు చేస్తున్న సమయంలో నొప్పి బాధించొచ్చు. ఈ నొప్పి కొంచెం నుంచి తీవ్రంగానూ ఉండొచ్చు. రెండు కాళ్లలోనూ నొప్పి అనిపించొచ్చు. ఒక్కోసారి ఒకే కాలులో ఎక్కువగా రావచ్చు. విశ్రాంతి ఇస్తే తగ్గిపోవచ్చు. ఇవన్నీ అధిక కొలెస్ట్రాల్ కు సంకేతంగా అనుమానించి వైద్యులను సంప్రదించాలి. 

అలా అని చేయి, కాలిలో వచ్చే ప్రతి నొప్పి కొలెస్ట్రాల్ సంకేతంగా చూడక్కర్లేదు. పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ లో కాళ్లు, చేతుల్లో నొప్పి వరకే కాకుండా.. కాళ్లలో బలహీనత, తిమ్మిర్లు, కాలి వేళ్ల గోళ్లు నిదానంగా పెరగడం, కాళ్లపై అల్సర్లు, కాళ్ల చర్మం పాలిపోవడం, బ్లూ రంగులోకి  మారడం, పురుషుల్లో అంగస్తంభన సమస్యలు కనిపిస్తాయి.

More Telugu News