30 సెకన్లలో రూ.35 లక్షల నగదు బ్యాగుతో చెక్కేసిన బాలుడు
- పాటియాల ఎస్ బీఐ శాఖలో ఘటన
- రద్దీ సమయంలో కౌంటర్ లోకి చొరబడిన బాలుడు
- నగదు ఉంచిన బ్యాగుతో ఉడాయింపు
- సీసీటీవీ కెమెరాల సాయంతో గుర్తించిన సిబ్బంది
ఉదయం రద్దీ వేళల్లో 11.37 గంటల సమయంలో ఇది జరిగింది. దీంతో సిబ్బంది ఆలస్యంగా గుర్తించారు. ఓ బాలుడు బ్యాంకు శాఖలోకి మరో వ్యక్తితో కలసి ప్రవేశించాడు. బ్యాంకులోనే 20 నిమిషాల పాటు అంతా పరిశీలించారు. ఆ తర్వాత నగదు బ్యాగు ఉంచిన ఐదో నంబర్ కౌంటర్ దగ్గరకు బాలుడు వెళ్లి 30 సెకన్లలోపే, దాన్ని తీసుకుని బయటకు వచ్చేశాడు. బ్యాంకు సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్టు ఎస్పీ వజీర్ సింగ్ తెలిపారు. ఈ వ్యవహారం వెనుక బ్యాంకు సిబ్బంది సహకారం ఉండొచ్చన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి.