ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటున్న కృతి శెట్టి?

  • టాలీవుడ్ లో వరుస సినిమాలతో దూసుకుపోతున్న కృతి 
  • స్టార్ హీరోల పక్కన ఛాన్సులు కొట్టేస్తున్న కన్నడ భామ
  • పెదవులకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటోందని ప్రచారం
Actress Krithi Shetty thinking of lips plastic surgery

టాలీవుడ్ లో ఇప్పుడున్న హీరోయిన్లలో అందరి కంటే లక్కీ కృతి శెట్టినే అని చెప్పుకోవచ్చు. తన తొలి చిత్రం 'ఉప్పెన'తోనే హిట్ అందుకున్న ఈ కన్నడ భామకు వరుసగా ఆఫర్లు వస్తున్నాయి. స్టార్ హీరోలు సైతం ఆమె తమ సినిమాలో ఉండాలని కోరుకుంటున్నారు. తమిళ పరిశ్రమలో కూడా కృతికి మంచి ఫాలోయింగ్ ఉంది. 

మరోవైపు తన గ్లామర్ ను మరింత పెంచుకునే యోచనలో ఆమె ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. తన అందానికి మరింత మెరుగులు దిద్దుకునేందుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలని భావిస్తోంది. తన పెదవులు కొచెం వెడల్పుగా ఉంటాయని... అందువల్ల తన ముఖంలో కొంత అందం తగ్గిందని ఆమె భావిస్తోందట. 

అందువల్లే తన పెదాలు మరింత అందంగా కనిపించేలా ప్లాస్టిక్ సర్జరీ చేయించుకోవాలనుకుంటోందట. ఇప్పటికే ఆమె ఒక డాక్టర్ ను కూడా కలిసిందట. అయితే ఈ ప్రచారంలో ఎంత నిజం ఉందో తెలియాల్సి ఉంది. మరోవైపు, అనవసరమైన ప్రయోగాల జోలికి వెళ్లి... ఉన్న అందం పాడు చేసుకోవద్దని ఆమెకు ఫ్యాన్స్ సలహా ఇస్తున్నారు.

More Telugu News