రెండు ఫ్లాపులు ఇచ్చాను .. ఈ సారి హిట్ తప్పదు: హను రాఘవపూడి

  • ప్రభాస్ చీఫ్ గెస్టుగా జరిగిన 'సీతా రామం' ప్రీ రిలీజ్ ఈవెంట్
  • ఈ సారి సెకండాఫ్ కూడా బాగా తీశానన్న హను రాఘవపూడి
  • ఆడియన్స్ తెరకి అంకితమైపోతారంటూ వ్యాఖ్య
  • థియేటర్లో మొబైల్స్ ముట్టుకోరన్న దర్శకుడు
Sita Ramam Movie Update

హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా 'సీతా రామం' సినిమా రూపొందింది. అశ్వనీదత్ - స్వప్న సినిమాస్ నిర్మించిన ఈ సినిమాను ఈ నెల 5వ తేదీన విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభాస్ చీఫ్ గెస్టుగా నిన్న రాత్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది. ఈ సినిమాకి సంబంధించిన టీమ్ మాత్రమే ఇందులో పాల్గొంది. 

హను రాఘవపూడి మాట్లాడుతూ .. " ఇంతకుముందు నేను రెండు ఫ్లాపులు ఇచ్చాను ..  ఈ సారి మాత్రం అలా జరగదు. ఇది నేను గర్వంతోనో .. అహంభావంతోనో చెబుతున్న మాట కాదు. ఈ సినిమాపై నాకున్న నమ్మకంతో చెబుతున్నాను. సినిమా అంత బాగా రావడానికి కారణం టీమ్ వర్క్ .. ఆర్టిస్టుల పెర్ఫార్మెన్స్. 

నా సినిమాల్లో సెకండాఫ్ ను చెడగొడతాననే నింద నాపై ఉంది. ఈ సినిమా విషయంలో అలా జరగదని చెబుతున్నాను. తెరపై ఈ సినిమా నడుస్తుండగా ఎవరూ కూడా మొబైల్ బయటికి తీయరు. తెరకి అంకితమైనట్టుగా కథలో ఇన్వాల్వ్ అవుతారు. ఈవెంట్ కే ఈ సినిమా 'బాహుబలి'ని రప్పించిందంటే, అన్నీ ఎలా కుదిరాయనేది మీరు అర్థం చేసుకోవచ్చు" అని చెప్పుకొచ్చాడు.

More Telugu News