TDP: వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డిపై తెలుగు మ‌హిళ‌ల ఆగ్రహం.. వీడియో పోస్ట్ చేసిన టీడీపీ

tdp women and students wings agitations against ysrcp mp vijay sai reddy
  • విజయసాయిరెడ్డి ఆరోపణలకు నిర‌స‌న‌గా టీడీపీ శ్రేణుల ఆందోళన 
  • లోకేశ్‌పై అవాకులు పేలితే బ‌డితె పూజ త‌ప్ప‌దంటూ వార్నింగ్‌
  • నిరసన కార్యక్రమంలో తెలుగు మ‌హిళ‌, తెలుగు విద్యార్థి విభాగాలు 
  వైసీపీ ఎంపీ విజ‌య‌సాయిరెడ్డి ఫొటోకు చెప్పుల దండ‌లు వేసిన టీడీపీ మ‌హిళా విభాగం, విద్యార్థి విభాగాల శ్రేణులు... ఆయ‌న‌కు తీవ్ర హెచ్చ‌రిక‌లు జారీ చేసినట్టు టీడీపీ తన అధికారిక ట్విట్టర్ అకౌంట్ లో పేర్కొంది. శ్రీ బాలాజీ జిల్లా గూడూరులో నిర్వ‌హించిన ఆందోళ‌న‌లో భాగంగా తెలుగు మ‌హిళ‌, తెలుగు విద్యార్థి విభాగాలు ఈ వినూత్న నిర‌స‌న‌కు దిగాయని తెలిపింది.  

టీడీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నారా లోకేశ్‌పై అవాకులు, చెవాకులు పేలితే బ‌డితె పూజ త‌ప్ప‌దంటూ వారు ఈ సంద‌ర్భంగా సాయిరెడ్డిని హెచ్చ‌రించారు. ఈ నిర‌స‌న‌కు సంబంధించిన వీడియోను టీడీపీ త‌న అధికారిక సోష‌ల్ మీడియా ఖాతాల్లో పోస్ట్ చేసింది.
TDP
YSRCP
Vijay Sai Reddy
Gudur
Telugu Mahila
Telugu Vidyarthi

More Telugu News