ఇక్కడ హిట్ అయితే 'బింబిసార'ను పట్టుకోవడం కష్టమే!

  • 'బింబిసార'గా కల్యాణ్ రామ్ 
  • సైన్స్ ఫిక్షన్ ను టచ్ చేస్తూ సాగే కథ 
  • ఈ నెల 5వ తేదీన తెలుగులో విడుదల 
  • ఇక్కడ హిట్ అయితే 18న ఇతర భాషల్లో రిలీజ్    
Bimbisara movie update

కథాకథనాల పరంగా .. బడ్జెట్ పరంగా కల్యాణ్ రామ్ ఇంతవరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. 'బింబిసార' ఒక ఎత్తు. కొత్త దర్శకుడితో ఆయన నేరుగా సైన్స్ ఫిక్షన్ ను టచ్ చేశాడు. రాజు గెటప్ తోను .. సాధారణ యువకుడి లుక్ తోను ఆయన కనిపించనున్నాడు. ఈ నెల 5వ తేదీన ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. 

ఈ సినిమా ప్రమోషన్స్ లో కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "ప్రస్తుతానికి మేము ఈ సినిమాను పాన్ తెలుగు సినిమాగానే భావిస్తున్నాము. తెలుగులో ఈ సినిమా హిట్ అయితే అప్పుడు మిగతా భాషల్లో విడుదల చేయాలనే ఆలోచనలో ఉన్నాము. హిట్ టాక్ వస్తే ఈ నెల 18న ఈ సినిమాను పాన్ ఇండియా స్థాయిలో రిలీజ్ చేస్తాము" అన్నాడు. 

ఇతర భాషలన్నిటిలో రెండు వారాల్లో డబ్బింగ్ చేయడం చాలా కష్టమైన విషయం. కల్యాణ్ రామ్ డేట్ కూడా చెప్పేయడంతో, ముందుగానే అన్ని పనులు జరిగిపోయి ఉండొచ్చునని అనుకుంటున్నారు. కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించిన ఈ సినిమాలో సంయుక్త మీనన్ .. కేథరిన్ కథానాయికలుగా అలరించనున్నారు.

More Telugu News