ఒడిదుడుకుల మధ్య చివరకు లాభాల్లో ముగిసిన మార్కెట్లు

  • చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలతో మార్కెట్లలో ఒడిదుడుకులు
  • ట్రేడింగ్ చివర్లో లభించిన కొనుగోళ్ల మద్దతు
  • 214 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్
Markets ends in profits

దేశీయ స్టాక్ మార్కెట్లు ఈరోజు ట్రేడింగ్ ప్రారంభమైనప్పటి నుంచి తీవ్ర ఒడిదుడుకులకు లోనయ్యాయి. చైనా-తైవాన్ దేశాల మధ్య ఉద్రిక్తతల ప్రభావం మార్కెట్లపై పడింది. అయితే చివర్లో కొనుగోళ్ల మద్దతు లభించడంతో ట్రేడింగ్ పూర్తయ్యే సమయానికి లాభాల్లో ముగిశాయి. ఈరోజు ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 214 పాయింట్లు పెరిగి 58,351కి చేరుకుంది. నిఫ్టీ 43 పాయింట్లు పుంజుకుని 17,388 వద్ద స్థిరపడింది. 

బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
టెక్ మహీంద్రా (1.97%), టీసీఎస్ (1.51%), ఇన్ఫోసిస్ (1.44%), టైటాన్ (1.27%), ఏసియన్ పెయింట్స్ (1.22%. 

టాప్ లూజర్స్:
మారుతి సుజుకి (-2.29%), సన్ ఫార్మా (-2.17%), కోటక్ మహీంద్రా బ్యాంక్ (-1.75%), ఇండస్ ఇండ్ బ్యాంక్ (-0.90%), బజాజ్ ఫైనాన్స్ (0.65%).

More Telugu News