Chikoti Praveen Kumar: కావాలనే దుష్ప్రచారం.. సీఎం జగన్, చిన్నజీయర్ స్వామితో నాకు సంబంధాలు లేవు: చీకోటి ప్రవీణ్

I dont have contacts with Jagan and Chinna Jeeyar Swamy
  • కేసీనో కేసులో ఈడీ దర్యాప్తును ఎదుర్కొంటున్న చీకోటి ప్రవీణ్
  • తన పేరుపై తప్పుడు అకౌంట్ క్రియేట్ చేశారంటూ పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రవీణ్
  • తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఆవేదన
కేసినో కేసులో చీకోటి ప్రవీణ్ పై ఈడీ దర్యాప్తు అంశం రెండు తెలుగు రాష్ట్రాల్లో హాట్ టాపిక్ గా మారింది. ఇరు రాష్ట్రాల్లోని కొందరు రాజకీయ నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయనే వార్తలు కలకలం రేపుతున్నాయి. మరోవైపు సోషల్ మీడియాలో తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ హైదరాబాద్ లోని సీసీఎస్ పోలీసులకు ప్రవీణ్ ఫిర్యాదు చేశాడు. 

తన పేరుపై ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి, తనకు ఇబ్బంది కలిగేలా, తన పేరును కించపరిచేలా పోస్టులు పెడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫేక్ అకౌంట్ వల్ల మానసిక ఒత్తిడికి గురవుతున్నానని చెప్పారు. వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ తో తనకు సంబంధాలు ఉన్నాయనే ప్రచారంలో నిజం లేదని ఆయన చెప్పారు. చిన్నజీయర్ స్వామితో కూడా తనకు పరిచయం లేదని అన్నారు. తనపై కావాలనే కొందరు దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
Chikoti Praveen Kumar
Casino
Enforcement Directorate
Jagan
YSRCP
Chinna Jeeyar Swamy

More Telugu News