Sohail: బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ సినిమా నుంచి టైటిల్ లిరికల్ సాంగ్ విడుదల

Big Boss fame Sohel film Lucky Lakshman title lirical song launched
  • సొహైల్, మోక్ష జంటగా 'లక్కీ లక్షణ్' సినిమా
  • 'అదృష్టం చలో అందిరో చందమామ' టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ విడుదల
  • సాంగ్ ను లాంచ్ చేసిన డైరెక్టర్ శివ నిర్వాణ
బిగ్ బాస్ ఫేమ్ సొహైల్ హీరోగా దత్తాత్రేయ మీడియా పతాకంపై 'లక్కీ లక్ష్మణ్' పేరిట ఓ సినిమా తెరకెక్కుతోంది. ఈ చిత్రంలో సొహైల్ సరసన మోక్ష నటిస్తోంది. ఏఆర్ అభి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హరిత గోగినేని నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. చుట్టూ ఉన్న వారంతా నువ్వు లక్కీఫెలో అంటున్నా.. తాను మాత్రం ఎప్పటికీ అన్‌లక్కీఫెలోనే అని ఫీలయ్యే ఓ యువకుడి జీవితంలో జరిగిన అనేక ఆసక్తికర పరిణామాలతో పూర్తి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 

తాజాగా ఈ సినిమాలోని 'అదృష్టం చలో అందిరో చందమామ' అంటూ సాగే టైటిల్ లిరికల్ వీడియో సాంగ్ ను విడుదల చేశారు. 'మజిలీ', 'ఖుషి' సినిమాలను తెరకెక్కించిన దర్శకుడు శివ నిర్వాణ చేతుల మీదుగా సాంగ్ విడుదలయింది. ఈ పాటను భాస్కరభట్ల రాయగా, అనూప్ రూబెన్స్ సంగీతాన్ని అందించారు. సింగర్ రామ్ మిరియాల పాటను ఆలపించారు. 

ఈ సందర్భంగా సొహైల్ మాట్లాడుతూ, తమ సినిమా టైటిల్ సాంగ్ వీడియోను శివ నిర్వాణ లాంచ్ చేయడం సంతోషంగా ఉందని చెప్పాడు. ఏఆర్ అభి, హరిత గోగినేనిలకు సినిమాలపై ఎంత ప్యాషన్ ఉందో... కథలను ఎంచుకోవడంలో కూడా వారికి అంతే అభిరుచి ఉందని కొనియాడాడు. క్వాలిటీ విషయంలో మేకర్స్ ఎక్కడా రాజీ పడలేదని... సీనియర్ టెక్నీషియన్స్ తో సినిమాను నిర్మించారని చెప్పాడు. 

ఈ చిత్రంలో దేవి ప్రసాద్, రాజా రవీంద్ర, సమీర్, కాదంబరి కిరణ్, షాని సాల్మన్, అనురాగ్, అమీన్, శ్రీదేవి కుమార్, మాస్టర్ రోషన్, మాస్టర్ అయాన్, మాస్టర్ సమీర్, మాస్టర్ కార్తికేయ, ఝాన్సీ, రచ్చ రవి, జబర్దస్త్ కార్తిక్ , జబర్దస్త్ గీతు రాయల్ తదితరులు నటించారు.
Sohail
Bigg Boss
Lucky Lakshman Movie
Lirical video song
Tollywood

More Telugu News